Telugu Global
National

ఐశ్వ‌ర్య‌పై వివేక్ ట్వీట్.... ఆడుకున్న నెటిజ‌న్లు !

ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చాయి. వాటిపై సెటైర్లు వేశాడు ఓ వ్య‌క్తి. దీన్ని తన ట్విట్ట‌ర్‌లో వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశాడు. అంతే నెటిజ‌న్లు ఆయ‌న్ని ఓ లెవెల్లో ఆడుకున్నారు. బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యరాయ్‌ని అవ‌మానించార‌ని చెడుగుడు ఆడారు. పెళ్లి అయి ఓ కూతురికి త‌ల్లి అయిన ఆమెను ఇలా అవ‌మానించొచ్చా అని ప్ర‌శ్నించారు. గతంలో ఐశ్వర్య.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్‌లతో డేటింగ్ చేసింది. ఆ తరువాత అభిషేక్‌ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇప్పుడు ఓ […]

ఐశ్వ‌ర్య‌పై వివేక్ ట్వీట్.... ఆడుకున్న నెటిజ‌న్లు !
X

ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ వ‌చ్చాయి. వాటిపై సెటైర్లు వేశాడు ఓ వ్య‌క్తి. దీన్ని తన ట్విట్ట‌ర్‌లో వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశాడు. అంతే నెటిజ‌న్లు ఆయ‌న్ని ఓ లెవెల్లో ఆడుకున్నారు. బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యరాయ్‌ని అవ‌మానించార‌ని చెడుగుడు ఆడారు. పెళ్లి అయి ఓ కూతురికి త‌ల్లి అయిన ఆమెను ఇలా అవ‌మానించొచ్చా అని ప్ర‌శ్నించారు.

గతంలో ఐశ్వర్య.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్‌లతో డేటింగ్ చేసింది. ఆ తరువాత అభిషేక్‌ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇప్పుడు ఓ కూతురు. అయితే ఆమె ల‌వ్‌స్టోరీల‌ను…ప్ర‌స్తుత ఎగ్జిట్‌పోల్స్‌కు లింక్ చేస్తూ ఓ వ్య‌క్తి పోస్టు త‌యారు చేశారు. ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని రాశారు.

ఈ పోస్టు త‌న‌కు ఎవ‌రో పంపించార‌ని… దీనిపై రాజ‌కీయాలు వ‌ద్దని… ఓన్లీ క్రియేటివ్ అంటూ వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేయ‌డం దుమారం రేపింది. ఐశ్వ‌ర్య‌ను అవమానించేలా ఈ పోస్టు ఉంద‌ని నెటిజ‌న్ లు వివేక్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే వివేక్ ప‌ని అస‌హ్యంగా ఉంద‌ని గుత్తా జ్వాల, సోన‌మ్ క‌పూర్ లాంటి వారు కామెంట్లు చేశారు. మ‌హారాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ వివేక్‌కు నోటీసులు జారీ చేసింది. ట్వీట్‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది.

అయితే వివేక్ మాత్రం త‌న‌కు వ‌చ్చిన పోస్టును ట్విట్ చేశాన‌ని….అందులో క్రియేటివిటీ త‌న‌కు న‌చ్చింద‌ని…ఇందులో వివాదం ఏంట‌ని ఆయ‌న అమాయకంగా ప్ర‌శ్నించారు. ఒక పరాయి స్త్రీ గౌరవాన్ని కించపరిచే ఇలాంటి నీచులకు నెటిజన్ లు బాగానే బుద్ధి చెబుతున్నారు.

Next Story