Telugu Global
International

సహజవాయు రంగంలో వివిధ దేశాలకు విస్తరిస్తున్న 'మేఘా'

సహజ వాయువు, చమురు రంగాలలో గత ఏడాదిలో దేశ, విదేశాల్లో వివిధ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి మేఘా రికార్డ్‌ సృష్టించింది. దేశంలో అసోం, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ, త్రిపుర, కర్ణాటక, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులను చేపట్టడమే కాకుండా కువైట్‌, జోర్డాన్‌, బాంగ్లాదేశ్‌, సింగపూర్‌ తదితర దేశాలో రిఫైనరీ తదితర పనులను చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నది. జోర్డాన్లో 54 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను, కువైట్‌లో 66 స్టోరేజ్‌ ట్యాంకుల నిర్మాణం, రికార్డ్‌ […]

సహజవాయు రంగంలో వివిధ దేశాలకు విస్తరిస్తున్న మేఘా
X

సహజ వాయువు, చమురు రంగాలలో గత ఏడాదిలో దేశ, విదేశాల్లో వివిధ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి మేఘా రికార్డ్‌ సృష్టించింది. దేశంలో అసోం, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెంగాణ, త్రిపుర, కర్ణాటక, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్టులను చేపట్టడమే కాకుండా కువైట్‌, జోర్డాన్‌, బాంగ్లాదేశ్‌, సింగపూర్‌ తదితర దేశాలో రిఫైనరీ తదితర పనులను చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నది.

జోర్డాన్లో 54 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను, కువైట్‌లో 66 స్టోరేజ్‌ ట్యాంకుల నిర్మాణం, రికార్డ్‌ సమయంలో రాజస్థాన్‌లోని రాగేశ్వరి గ్యాస్‌ యూనిట్‌, ఓఎన్‌జీసీలో 6 పైప్‌లైన్ల రిప్లేస్‌మెంట్‌…. అస్సాం రాష్ట్రంలో ఓఎన్‌జీసీ 5 పైప్‌లైన్ల రిప్లేస్‌మెంట్‌, ఈశాన్య రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అస్సాంలో గ్యాస్‌ ఉత్పత్తి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌, నాగాయలంక, పెనుగొండలో ఆన్‌షోర్‌ ఫీల్డ్స్‌ రికార్డు టైమ్ లో ఏర్పాటు చేసింది మేఘా.

జోర్డాన్లో

జోర్డాన్‌లో సహజవాయువుతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంటును మేఘా ఏర్పాటు చేసింది. దీని ద్వారా 54 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. 2018 అక్టోబర్‌లో మేఘా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి అరబ్‌ కంపెనీకి అప్పగించింది.

కువైట్‌ల్‌జౌర్‌ ప్రాజెక్ట్‌

కువైట్‌లో 66 ఆయిల్‌ స్టోరేజ్‌ ట్యాంకులను మేఘా నిర్మించింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 3000 మంది మేఘా సిబ్బంది పనిచేస్తున్నారు. కోటి గంటల పాటు పని జరిగినా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నందుకు కెఐపీఐసీ నుంచి మేఘా ప్రశంసా పత్రం అందుకుంది.

రాగేశ్వరి గ్యాస్ప్రాసెసింగ్యూనిట్

రాజస్థాన్‌లోని రాగేశ్వరి గ్యాస్‌ టెర్మినల్‌ ప్లాంట్‌ను 6 నెలల్లోనే పూర్తి చేసి తనకు తానే సాటి అని మేఘా నిరూపించుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని 2018 సెప్టెంబర్‌ నెలలో పనులు మొదలుపెట్టి మార్చి 2019 నాటికి పూర్తి చేసింది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కేవలం ఆరునెలల రికార్డ్‌ సమయంలో పూర్తి చేసి కేయిర్న్‌ ఇండియాకు అప్పగించింది. ఇక్కడ 90 ఎంఎంఎస్‌ఎఫ్‌డి సామర్థ్యం గల ఆయిల్‌, గ్యాస్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లను మేఘా ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ పనులను మేఘా 18 నెలల పాటు చూడనుంది.

అస్సాం ఓఎన్‌జీసీ ప్రాజెక్ట్‌…

అస్సాంలోని ఓఎన్‌జీసీలో ఆరుపైపులను పునర్‌నిర్మించే ప్రాజెక్ట్‌ను మేఘా దక్కించుకుని విజయవంతంగా పూర్తిచేసింది. 5 సెగ్మెంట్లలో 128.3 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌, ఒక సెగ్మెంట్‌లో 16.5 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను మేఘా పునర్‌ నిర్మించి ఓఎన్‌జీసీకి అప్పగించింది. ఈ ప్రాజెక్ట్‌లో 2017లోనే మేఘా 48.3 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను పూర్తి చేసింది.

మూడు దశాబ్దాల ముందుచూపుతో….

అస్సాంలోని ఓఎన్‌జీసీ ప్రాజెక్ట్‌ వ్యవస్థను పునర్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టును మేఘా చేపట్టింది. అందులో కీలకమైన జిజిఎస్‌ను పూర్తి చేసి ఓఎన్‌జీసీకి మేఘా అప్పగించింది. జిజిఎస్‌లో ప్రధానంగా బావి నుంచి లభించే ముడి చమురును గ్యాస్‌, డీజిల్‌, ఇతర అనుబంధ ఉత్పత్తుగా వేరుచేసే సెపరేటర్లు ఉన్నాయి. వీటిని మేఘా అత్యంత అధునాతన సాంకేతిక పద్ధతుల్లో నిర్మించింది. ఇక్కడి పర్యావరణానికి హాని కలిగించని విధంగా ఉత్పత్తులను ప్రాసెస్‌ చేసే తదనంతరం నిల్వ, సరఫరాకు అవసరమైన నిర్మాణాలు జరిగాయి. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో రాబోయే మూడు దశాబ్దాల అవసరాలకు తగిన విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిర్మాణాలను మేఘా నిర్మించింది.

మెహసనలో అధునాతన అగ్నిమాపక సౌకర్యాలు

ఎంబీ లాల్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం గుజరాత్‌లోని మెహసనలో అగ్నిమాపక వ్యవస్థను 4 భాగాలుగా పునర్‌వ్యవస్థీకరించే ప్రాజెక్ట్‌ను మేఘా దక్కించుకుని పూర్తి చేసింది. ఇందులో కొత్తగా అగ్నిమాపక వ్యవస్థ నిర్మాణం, హైడ్రాన్ట్స్‌, వాటర్‌, ఫోమ్‌ మానిటర్లు, హెచ్‌వీఎల్‌ఆర్‌, నీటి స్ప్రింక్లర్‌ ల సిస్టం సహా మెహసానలో ఏర్పాటు చేశారు.

నాగాయలంక, పశ్చిమ పెనుగొండ గ్యాస్క్షేత్రాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలో గ్యాస్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి మేఘా నాగాయలంక, పశ్చిమ పెనుగొండ ప్రాంతాలలో ఓఎన్‌జీసీ నుంచి ఆన్‌షోర్‌ గ్యాస్‌ క్షేత్రాలను దక్కించుకుంది. ఈ క్షేత్రాల నుంచి రోజుకు 130000 ఎస్‌సీఎమ్‌ గ్యాస్‌ను తరలించేలా ఏర్పాటు చేసింది. ఇందుకోసం అమెరికా నుండి తెప్పించిన అధునాతన యంత్రాలను వినియోగిస్తున్నారు.

నాగాయలంక క్షేత్రాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గ్యాస్‌ను మేఘా పంపిణీ చేస్తోంది. అలాగే తెలంగాణాలో పరిశ్రమలకు కూడా అందించాలని మేఘా అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నది. పశ్చిమ పెనుగొండ క్షేత్రానికి ఓఎన్జీసీ ఆమోదం పొందిన తర్వాత ఇతర ప్రాంతాల్లో కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన అన్నింటిని మేఘా సిద్ధం చేసింది.

అలాగే గృహ అవసరాలకోసం మేఘా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్నాటకలో బెల్గాం, తూంకూరు జిల్లాలలో గ్యాస్ ను సరఫరా చేస్తోంది. తెలంగాణాలోని పది జిల్లాలలో త్వరలో సరఫరా ప్రారభించనుంది.

First Published:  20 May 2019 3:27 AM GMT
Next Story