Telugu Global
Health & Life Style

ఆరోగ్యానికి బెస్ట్... చికెన్ బ్రెస్ట్

చికెన్. ఈ పేరువింటే నూటికి తొంభై శాతం మందికి నోరూరుతుంది. ముక్క లేనిదే ముద్ద దిగదు మరికొంత మందికి. అయితే చికెన్ లో ఉన్న అన్ని అవయవాల కంటే కూడా బ్రెస్ట్ కు ప్రత్యకమైన స్దానం ఉంది. చికెన్ బ్రెస్ట్ పైన స్కిన్ ఉండదు. అలాగే ఎముకలూ ఉండవు. అందుకే దీన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే టేస్ట్ లోనే కాదు హెల్త్ లో కూడా చికెన్ బ్రెస్ట్… ది బెస్ట్ అంటున్నారు డాక్టర్లు. రెడ్ మీట్ […]

ఆరోగ్యానికి బెస్ట్... చికెన్ బ్రెస్ట్
X

చికెన్. ఈ పేరువింటే నూటికి తొంభై శాతం మందికి నోరూరుతుంది. ముక్క లేనిదే ముద్ద దిగదు మరికొంత మందికి. అయితే చికెన్ లో ఉన్న అన్ని అవయవాల కంటే కూడా బ్రెస్ట్ కు ప్రత్యకమైన స్దానం ఉంది. చికెన్ బ్రెస్ట్ పైన స్కిన్ ఉండదు. అలాగే ఎముకలూ ఉండవు. అందుకే దీన్ని తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే టేస్ట్ లోనే కాదు హెల్త్ లో కూడా చికెన్ బ్రెస్ట్… ది బెస్ట్ అంటున్నారు డాక్టర్లు.

  • రెడ్ మీట్ తో పోలిస్తే చికెన్ ఆరోగ్యానికి చాల మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
  • ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది.
  • ఇందులో ఉన్న విటమిన్ బి కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని అనేక రుగ్మతల నుంచి కాపాడుతుంది.
  • మిగతా మాంసాహారాలతో పోలిస్తే చికెన్ బ్రెస్ట్ లో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల గుండె సమస్యలు దరిచేరే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • బరువు తగ్గలానుకునే వారు డైట్ లో ఉంటారు. అటువంటి వారికి చికెన్ బ్రెస్ట్ లో ఉన్న పోషకాలు శరీరానికి శక్తిని ఇస్తాయి.
  • హైపర్ టెన్షన్, అధిక రక్తపోటుతో బాధపడేవారు చికెన్ బ్రెస్ట్ తింటే మంచి ఫలితం ఉంటుంది.
  • అధిక వొత్తిడితో బాధపడేవారు చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల బ్రెయిన్ లో ఉండే సెరోటోనిన్ స్దాయిలు పెరిగి వత్తిడి అదుపులోకి వస్తుంది.
  • ఇందులో ఉన్న బి6 విటమిన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు శరీరంలో ఉన్న రక్తస్దాయి కూడ మెరుగుపడుతుంది.
  • ఎముకలు, కండరాల బలానికి చికెన్ బ్రెస్ట్ ఎంతో ఉపయోగపడుతుంది.
  • చికెన్ లో అథికంగా ఉన్న ప్రోటీన్లు శరీరంలో ఉండే అనేక రుగ్మతలను నివారిస్తుంది.
First Published:  17 May 2019 9:45 PM GMT
Next Story