Telugu Global
Sports

గోవాలో కెప్టెన్, మాల్దీవ్స్ లో వైస్ కెప్టెన్

ఏడువారాల ఐపీఎల్ తో శారీరకంగా, మానసికంగా అలసిపోయిన టీమిండియా క్రికెటర్లు, శిక్షకులు, సహాయకసిబ్బంది..ప్రస్తుతం తమతమ కుటుంబసభ్యులతో కలసి విహారయాత్రలు చేస్తూ సేదతీరుతున్నారు. తగిన విశ్రాంతితో వన్డే ప్రపంచకప్ సమరానికి సమాయత్తమవుతున్నారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ 46 రోజులపాటు జరిగే వన్డే ప్రపంచకప్ కోసం విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత క్రికెటర్లు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. ఏడువారాల ఐపీఎల్ తో అలసిపోయిన టీమిండియా జట్టు సభ్యులకు ప్రపంచకప్ ప్రారంభానికి […]

గోవాలో కెప్టెన్, మాల్దీవ్స్ లో వైస్ కెప్టెన్
X

ఏడువారాల ఐపీఎల్ తో శారీరకంగా, మానసికంగా అలసిపోయిన టీమిండియా క్రికెటర్లు, శిక్షకులు, సహాయకసిబ్బంది..ప్రస్తుతం తమతమ కుటుంబసభ్యులతో కలసి విహారయాత్రలు చేస్తూ సేదతీరుతున్నారు. తగిన విశ్రాంతితో వన్డే ప్రపంచకప్ సమరానికి సమాయత్తమవుతున్నారు.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ 46 రోజులపాటు జరిగే వన్డే ప్రపంచకప్ కోసం విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత క్రికెటర్లు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. ఏడువారాల ఐపీఎల్ తో అలసిపోయిన టీమిండియా జట్టు సభ్యులకు ప్రపంచకప్ ప్రారంభానికి ముందు మూడువారాల విరామం మాత్రమే దక్కింది. దీంతో ప్రాక్టీసును పక్కనపెట్టి కుటుంబసభ్యులతో గడపాలని టీమ్ మేనేజ్ మెంట్ సలహా ఇచ్చింది.

గోవాలో కెప్టెన్ విరాట్ కొహ్లీ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన కుటుంబసభ్యులతో కలసి గోవాలో విహారయాత్రకు వెళ్లాడు. భార్య అనుష్క శర్మ, సోదరి మహిమ ఇతర కుటుంబసభ్యులతో
గోవాలో కొహ్లీ సేదతీరాడు. అక్కడి బీచ్ లు, సీఫుడ్ ను ఆస్వాదిస్తూ గడిపాడు.టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సైతం గోవాలోనే తన విరామసమయాన్ని గడుపుతూ విశ్రాంతి తీసుకొన్నాడు.
మాల్దీవుల్లో రోహిత్ శర్మ..భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం భార్య, కూతురు, అత్తమామలతో కలసి మాల్దీవుల విహారయాత్రకు వెళ్లాడు. మాలే చుట్టుపక్కల ద్వీపాలను సందర్శిస్తూ…అక్కడి సాగరజలాలలో ఈత కొడుతూ కేరింతలు కొట్టాడు.మాల్దీవుల్లో తమ ఫోటోలను సైతం ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానుల ముందుంచాడు.

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ సైతం తన భార్య సాగరికా గట్గేతో కలసి మాల్దీవుల్లోనే గడిపాడు.మొత్తం మీద…కుటుంబసభ్యులతో విహారయాత్రలు చేస్తూ…భారతజట్టు సభ్యులు ప్రపంచకప్ ప్రారంభానికి ముందే సేద తీరటం, రెట్టించిన
ఆత్మవిశ్వాసంతో సిద్ధంకావాలన్న పట్టుదలతో ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామమే.

First Published:  18 May 2019 12:13 AM GMT
Next Story