Telugu Global
Cinema & Entertainment

రాహుల్ రామకృష్ణ మంచి నటుడే.... కానీ మంచి మనిషి కాదట

‘అర్జున్ రెడ్డి’ సినిమా తో కమెడియన్ గా పరిచయం అయిన రాహుల్ రామకృష్ణ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ‘భరత్ అనే నేను’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలలో సైతం కనిపించి మెప్పించాడు రాహుల్ రామకృష్ణ. ఈ మధ్యనే ‘మిఠాయి’ అనే సినిమాలో ముఖ్యపాత్ర పోషించాడు. అయితే తాజాగా ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్…. రాహుల్ రామకృష్ణ గురించి సంచలనాత్మకంగా మాట్లాడటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఫేస్‌ బుక్ వేదికగా […]

రాహుల్ రామకృష్ణ మంచి నటుడే.... కానీ మంచి మనిషి కాదట
X

‘అర్జున్ రెడ్డి’ సినిమా తో కమెడియన్ గా పరిచయం అయిన రాహుల్ రామకృష్ణ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ‘భరత్ అనే నేను’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలలో సైతం కనిపించి మెప్పించాడు రాహుల్ రామకృష్ణ.

ఈ మధ్యనే ‘మిఠాయి’ అనే సినిమాలో ముఖ్యపాత్ర పోషించాడు. అయితే తాజాగా ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్…. రాహుల్ రామకృష్ణ గురించి సంచలనాత్మకంగా మాట్లాడటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఫేస్‌ బుక్ వేదికగా రాహుల్ రామకృష్ణ ప్రవర్తనపై పెద్ద పోస్ట్ పెట్టాడు ఆ చిత్ర దర్శకుడు.

రాహుల్ రామకృష్ణ ఒక్క అబద్దాల కోరు అని, ఎప్పుడూ పక్క వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూనే ఉంటాడని ఆరోపించాడు. అంతేకాక ‘భరత్ అనే నేను’ సినిమాలో తన పాత్ర మహేష్ బాబు పాత్ర ను డామినేట్ చేస్తుండటంతో కావాలని మహేష్ బాబు తన పాత్రను తగ్గించాడని, సూపర్ స్టార్‌ కి రాహుల్ నటన అంటే భయం అని నమ్మించడానికి ప్రయత్నించాడని ఆ దర్శకుడు పేర్కొన్నారు. రాహుల్ ఒక మంచి నటుడు కావచ్చు కానీ మంచి మనిషి మాత్రం కాదని తేల్చి చెప్పాడు ఆ దర్శకుడు.

ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మహేష్ అభిమానులు అందరూ రాహుల్ రామకృష్ణ పై నిప్పులు చెరుగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో రాహుల్ ఎలా రియాక్ట్ అవుతాడో ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  16 May 2019 1:31 AM GMT
Next Story