Telugu Global
NEWS

ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా వేసిన విద్యామండలి

ఏపీలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18న ఎంసెట్ రిజల్ట్స్ విడుదల చేయాలి.. కానీ తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం వాయిదా వేశారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు కూడా వెయిటేజీ ఉంటుంది. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్నందువల్ల ఇంకా ఫలితాలు వెల్లడించలేదు. రీ-వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ తర్వాత తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడటానికి సమయం పడుతుంది. దీంతో ఆ […]

ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా వేసిన విద్యామండలి
X

ఏపీలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18న ఎంసెట్ రిజల్ట్స్ విడుదల చేయాలి.. కానీ తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కోసం వాయిదా వేశారు.

ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు కూడా వెయిటేజీ ఉంటుంది. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొన్నందువల్ల ఇంకా ఫలితాలు వెల్లడించలేదు. రీ-వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ తర్వాత తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడటానికి సమయం పడుతుంది. దీంతో ఆ ఫలితాలు వెలువడిన తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు వెల్లడించాలని ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

కాగా, ఎంసెట్ పరీక్షకు 1,85,711 మంది ఇంజనీరింగ్, 81,916 మంది వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

First Published:  16 May 2019 9:50 AM GMT
Next Story