Telugu Global
Health & Life Style

పెరుగు.... ఆరోగ్యం మెరుగు

పెరుగు లేనిదే ఆ పూట భోజనం అసంపూర్ణమే. చాలా మందికి ఎంత తిన్నా కూడా చివరిలో పెరుగుతో ముగించకపోతే భోజనం చేసిన ఫీలింగ్ ఉండదు. కడుపు నిండినట్లు కూడా అనిపించదు. పెరుగుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెరుగు గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఆవుపాలతో చేసే పెరుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అయితే గేదే పాలతో చేసిన పెరుగు కూడా ఆరోగ్యమే అంటున్నారు వైద్యులు. పెరుగుతో రకరకాల పళ్లను […]

పెరుగు.... ఆరోగ్యం మెరుగు
X

పెరుగు లేనిదే ఆ పూట భోజనం అసంపూర్ణమే. చాలా మందికి ఎంత తిన్నా కూడా చివరిలో పెరుగుతో ముగించకపోతే భోజనం చేసిన ఫీలింగ్ ఉండదు. కడుపు నిండినట్లు కూడా అనిపించదు. పెరుగుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెరుగు గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం.

  • ఆయుర్వేదంలో ఆవుపాలతో చేసే పెరుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అయితే గేదే పాలతో చేసిన పెరుగు కూడా ఆరోగ్యమే అంటున్నారు వైద్యులు.
  • పెరుగుతో రకరకాల పళ్లను కలిపి తీసుకుంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఇన్ ఫెక్షన్లను నివారిస్తుంది.
  • పెరుగులో ఉన్న బ్యాక్టీరియా హానికరమైన బ్యాక్టీరియా కాదు. మంచి బ్యాక్టీరియా. ఇది శరీరంలో ఉన్న అనేక రుగ్మతలను నివారిస్తుంది.
  • చుండ్రు పోవాలంటే పెరుగును తలకి బాగా పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే క్రమేపీ తగ్గుతుంది.
  • పెరుగు శరీరంలో వృధ్దాప్య ఛాయలను కనిపించనివ్వదు.
  • సన్ బర్న్ ఉన్న చోట ఆరారగా పెరుగును రాస్తే అవి వెంటనే తగ్గిపోతాయి.
  • అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు రోజుకు కనీసం రెండు కప్పుల పెరుగు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • పెరుగులో చక్కెర కలుపుకుని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. పెరుగు మంచి ఎనర్జీ బూస్టర్.
  • నీళ్ల విరోచనాలతో బాధపడుతున్న వారు పెరుగులో కొద్దిగా మెంతులు వేసుకుని తీసుకుంటే చాలా మంచిది.
  • డైట్ లో ఉన్నవారు పెరుగులో అటుకులు, ఓట్స్, మరమరాలతో కలిపి తీసుకుంటే శరీరానికి చలువ చేయడమే కాకుండా తొందరగా ఆకలి వేయదు.
  • పెరుగులో ఉన్న విటమిన్ కె కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది.
  • పెరుగులో వాము కలుపుకుని తింటే దంతక్షయం, దంతాలకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి.
  • అధిక వొత్తిడితో బాధపడుతున్న వారు పెరుగు తింటే ఆ వత్తిడికి దూరం అవుతారు.
  • శరీరంలో హర్మోన్ల అసమతుల్యతలను పెరుగు అదుపు చేస్తుంది.
  • పెరుగులో ఫ్యాట్ అతి తక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగు ఎంత తిన్నా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ చేరదు.
  • కొద్దిగా నల్ల ఉప్పు పొడిని పెరుగులో కలుపుకుని తింటే అజీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
  • పెరుగులో ఉన్న క్యాల్షియం ఎముకలకు, కండరాలకు, దంతాలకు బలాన్ని ఇస్తుంది.
  • శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నవారు పెరుగులో పసుపు, అల్లం కలుపుకుని తినాలి.
  • విటమిన్ సి లోపంతో బాధపడుతున్నవారు పెరుగులో నిమ్మకాయ, లేక బత్తాయి, కమలాపండు జ్యూస్ తో తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • ఎసిడిటి, గ్యాస్ సమస్యలకు పెరుగు, తేనే కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • రోజు పెరుగు తినే వారికి క్యాన్సర్, ఇన్ టెస్టైన్ కు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • రోజు పెరుగు తినే వారి చర్మం మంచి కాంతివంతగాను, ఆరోగ్యంగాను ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • పాలకంటే కూడా పెరుగు అతి త్వరగా జీర్ణం అవుతుందని నిపుణుల అభిప్రాయం. పెరుగు గంటకు 90 శాతం జీర్ణం అయితే, పాలు 30 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని వారు అంటున్నారు.
First Published:  14 May 2019 9:40 PM GMT
Next Story