Telugu Global
Cinema & Entertainment

తాప్సి 'గేమ్ ఓవర్'

దక్షిణ భారత సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టి, ఇక్కడ తన మార్క్ ని చూపెట్టి… ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయిన భామ తాప్సి. ఝుమ్మంది నాదం సినిమా తో తెరంగేట్రం చేసిన ఈ భామ క్రమక్రమం గా బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకోవడం లో విజయం సాధించింది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ‘పాన్ ఇండియా’ సినిమాల్లో తాప్సి పేరు ముందు వినిపిస్తుంది. ఈ భామ ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్ […]

తాప్సి గేమ్ ఓవర్
X

దక్షిణ భారత సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టి, ఇక్కడ తన మార్క్ ని చూపెట్టి… ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయిన భామ తాప్సి. ఝుమ్మంది నాదం సినిమా తో తెరంగేట్రం చేసిన ఈ భామ క్రమక్రమం గా బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకోవడం లో విజయం సాధించింది అనే చెప్పాలి.

అయితే ఇప్పుడు ‘పాన్ ఇండియా’ సినిమాల్లో తాప్సి పేరు ముందు వినిపిస్తుంది. ఈ భామ ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటించనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చేయనున్న ఈ చిత్రానికి ‘గేమ్ ఓవర్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు నిర్మాతలు.

నయనతార తో మాయ అనే సినిమా చేసిన అశ్విన్ ఈ సినిమా కి దర్శకుడు కాగా…. వై నాట్ స్టూడియోస్ ఈ సినిమా ని నిర్మిస్తుంది. ఈ సినిమా ని అనురాగ్ కశ్యప్ సమర్పిస్తుండడం విశేషం.

ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఈ సినిమా లో వీడియో గేమ్ డెవలపర్ గా తాప్సి కనిపించనుంది. మాయ తరహా లో నే ఇది కూడా ఒక వైవిధ్యమైన హారర్ చిత్రం గా మన ముందుకు త్వరలో రానుంది.

First Published:  11 May 2019 2:51 AM GMT
Next Story