Telugu Global
Cinema & Entertainment

రాజశేఖర్ అలా ప్రతీకారం తీర్చుకున్నాడా!

మహర్షి సినిమాతో పాటు విడుదలైంది కల్కి కమర్షియల్ (థియేట్రికల్ ట్రయిలర్ కాదు) ట్రయిలర్. ఈ ట్రయిలర్ లో రాజశేఖర్ చేసిన కామెడీ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఈ కామెడీ సంగతి పక్కనపెడితే, రాజశేఖర్ ఇలా చేయడానికి గతంలో ఓ వివాదమే కారణం అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సీన్ ఉంటుంది. అందులో రాజశేఖర్ ను అనుకరిస్తూ ఓ పాట ఉంటుంది. దీనిపై పవన్ కల్యాణ్ పంచ్ కూడా ఉంది. ఏం […]

రాజశేఖర్ అలా ప్రతీకారం తీర్చుకున్నాడా!
X

మహర్షి సినిమాతో పాటు విడుదలైంది కల్కి కమర్షియల్ (థియేట్రికల్ ట్రయిలర్ కాదు) ట్రయిలర్. ఈ ట్రయిలర్ లో రాజశేఖర్ చేసిన కామెడీ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. ఈ కామెడీ సంగతి పక్కనపెడితే, రాజశేఖర్ ఇలా చేయడానికి గతంలో ఓ వివాదమే కారణం అనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.

గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సీన్ ఉంటుంది. అందులో రాజశేఖర్ ను అనుకరిస్తూ ఓ పాట ఉంటుంది. దీనిపై పవన్ కల్యాణ్ పంచ్ కూడా ఉంది. ఏం సేస్తిరి… ఏం సేస్తిరి అంటూ పవన్ ఓ సెటైర్ కూడా వేస్తాడు. అప్పట్లో చిరంజీవి-రాజశేఖర్ మధ్య ఉన్న వివాదం కారణంగానే పవన్ ఇలా అతడిపై పంచ్ లు వేశాడని అంతా అనుకున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు రాజశేఖర్ కు అవకాశం వచ్చింది.

అప్పటి పంచ్ కు రివర్స్ పంచ్ ఇచ్చాడు రాజశేఖర్. కల్కి ట్రయిలర్ లో ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి అనే డైలాగ్ ను రాజశేఖర్ తో కూడా చెప్పించారు. అంతేకాదు, గబ్బర్ సింగ్ లో ఏ నటుడైతే రాజశేఖర్ పాటను ఇమిటేట్ చేశాడో.. అదే నటుడ్ని కల్కి సినిమాలో కూడా పెట్టి, రాజశేఖర్ బ్రాండ్ మార్క్ స్టెప్ వేయించారు. ఆ తర్వాత రాజశేఖర్ అతడ్ని కాలితో తన్నే సీన్ కూడా పెట్టారు.

ఇవన్నీ చూస్తుంటే.. అప్పటి వివాదంపై ప్రతీకారం తీర్చుకునేలా కల్కి సినిమాలో ఓ ఎపిసోడ్ పెట్టినట్టు స్పష్టంగా అర్థమౌతూనే ఉంది. అయితే ట్రయిలర్ లో పవన్ పై నేరుగా విమర్శలు లేవు. సినిమాలో మాత్రం కచ్చితంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రియల్ లైఫ్ తో పాటు.. రాజకీయంగా కూడా ఇప్పుడు రాజశేఖర్-పవన్ విరోధులు కదా.

https://www.facebook.com/DrRajasekharOfficial/posts/1122219461291773

First Published:  10 May 2019 11:28 PM GMT
Next Story