Telugu Global
Health & Life Style

అనారోగ్య "చింత" లేని చిగురు....

చింత చిగురు సాధారణంగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో దొరుకుతుంది. చింతచిగురు పచ్చడి, పప్పు లేదా కూరల్లో వాడతారు. అయితే ఇది రొయ్యలతో కలిపి వండితే చాలా మంది ఇష్టపడతారు. చింత చిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. చింత చిగురులో ఉన్న ఐరన్, విటమిన్స్ అనేక రుగ్మతలను తగ్గిస్తుంది. అవి ఏమిటో తెల్సుకుందాం. చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో అనేక క్రిములను, రోగాలను అరికడతాయి. మనం రోజూ […]

అనారోగ్య చింత లేని చిగురు....
X

చింత చిగురు సాధారణంగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో దొరుకుతుంది. చింతచిగురు పచ్చడి, పప్పు లేదా కూరల్లో వాడతారు. అయితే ఇది రొయ్యలతో కలిపి వండితే చాలా మంది ఇష్టపడతారు. చింత చిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. చింత చిగురులో ఉన్న ఐరన్, విటమిన్స్ అనేక రుగ్మతలను తగ్గిస్తుంది. అవి ఏమిటో తెల్సుకుందాం.

  • చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో అనేక క్రిములను, రోగాలను అరికడతాయి.
  • మనం రోజూ వాడే చింతపండు కంటే కూడా చింత చిగురులో అనేక ఆరోగ్య గుణాలు ఉన్నాయి. చింత చిగురులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • శరీరంలో ఉన్న అనేక వ్యర్దాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది.
  • నులిపురుగులతో బాధపడుతున్న వారికి చింత చిగురు అద్భుతంగా పనిచేస్తుంది.
  • రక్తాన్ని శుద్దిచేయడంలో చింతచిగురుకు ఏదీ సాటి లేదు.
  • మలేరియా జ్వరానికి చింతాకు టీని తాగమని ఆయుర్వేదం సూచిస్తోంది.
  • చింత చిగురులో ఉన్న ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచి రక్తహీనత నుంచి కాపాడుతుంది.
  • చింత చిగురును నమిలినా, లేదా దీని కషాయాన్ని పుక్కిలించినా దంత సమస్యలు, నోటి పూత, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
  • చింత చిగురు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను చేరనివ్వదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  • చింత చిగురు ఎముకలకు బలాన్ని ఇస్తుంది. పటుత్వాన్ని పెంచుతుంది.
  • ఇందులో ఉన్న యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు కీళ్ల నొప్పులు, అన్నిరకాల వాపులను నివారిస్తుంది.
  • వీలైనంత వరకూ చింతపండు బదులు చింత చిగురు వాడటమే మేలని వైద్యులు సూచిస్తున్నారు.
  • చింత చిగురును మెత్తగా నూరి దాని రసాన్ని వేడినీటితో పరగడుపునే తాగితే పచ్చకామేర్ల వ్యాధిని నివారించవచ్చునని ఆయుర్వేదం చెబుతోంది.
  • చింత చిగురును కొద్దిగా వేయించి దానిని కురుపులకు కడితే అవి వెంటనే పగలడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది.
  • చింత చిగురు రసం దురదలు, గజ్జి, చిముడు వంటి చర్మ వ్యాధులకు దివ్యౌషధం.
First Published:  10 May 2019 9:25 PM GMT
Next Story