Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా.... విజయ్ దేవరకొండ సినిమా

ఒకవైపు నటుడిగా తన సత్తా చాటుతూనే మరొకవైపు ఏఎంబీ సినిమాస్ థియేటర్ తో బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు మహేష్ బాబు. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా నిర్మాతగా కూడా మారబోతున్నాడు మహేష్. జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మహేష్ బాబు త్వరలో సినిమాలను నిర్మించబోతున్నాడు. ఇప్పటికే అడవి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమాను త్వరలో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా అవ్వలేదు కానీ మహేష్ బాబు […]

మహేష్ బాబు ప్రొడ్యూసర్ గా.... విజయ్ దేవరకొండ సినిమా
X

ఒకవైపు నటుడిగా తన సత్తా చాటుతూనే మరొకవైపు ఏఎంబీ సినిమాస్ థియేటర్ తో బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నాడు మహేష్ బాబు. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా నిర్మాతగా కూడా మారబోతున్నాడు మహేష్.

జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మహేష్ బాబు త్వరలో సినిమాలను నిర్మించబోతున్నాడు. ఇప్పటికే అడవి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమాను త్వరలో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా అవ్వలేదు కానీ మహేష్ బాబు అప్పుడే మరో ఆసక్తికరమైన ప్రాజెక్టును ఓకే చేశాడట.

నిజానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తరువాత దర్శకుడు సందీప్ వంగా మహేష్ వద్దకు వచ్చి ఒక కథ వినిపించాడట. కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట. అంతేకాకుండా ఈ సినిమా ని స్వయంగా మహేష్ బాబు తన హోం బ్యానర్ పై నిర్మించనున్నాడు. మంచి కథ, మంచి టాలెంట్ ని తాను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాను అని, అందుకే ఒకవేళ తను హీరోగా నటించలేకపోయినా వేరే హీరో తో నైనా సినిమా తీసి దానికి నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని మహేష్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

First Published:  8 May 2019 10:45 PM GMT
Next Story