Telugu Global
NEWS

మంత్రి శ్రవణ్‌కు గవర్నర్ అల్టిమేటం.... వెంటనే రాజీనామా చేయండి

ఏపీ వైద్యారోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రవణ్ తండ్రి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన తర్వాత చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే, ఆయన ఏ చట్ట సభలోనూ సభ్యుడుగా లేడు. నిబంధనల ప్రకారం మంత్రిగా ఎవరైనా సాధారణ వ్యక్తి నియమించబడితే.. ఆరు నెలల్లోపు ఏదైనా చట్ట సభకు ఎన్నిక కావల్సి ఉంది. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా […]

మంత్రి శ్రవణ్‌కు గవర్నర్ అల్టిమేటం.... వెంటనే రాజీనామా చేయండి
X

ఏపీ వైద్యారోగ్య, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రవణ్ తండ్రి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన తర్వాత చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే, ఆయన ఏ చట్ట సభలోనూ సభ్యుడుగా లేడు.

నిబంధనల ప్రకారం మంత్రిగా ఎవరైనా సాధారణ వ్యక్తి నియమించబడితే.. ఆరు నెలల్లోపు ఏదైనా చట్ట సభకు ఎన్నిక కావల్సి ఉంది. గత ఏడాది నవంబర్ 11న ఆయన మంత్రిగా స్వీకరించారు. మే 10 నాటికి ఆరు నెలలు పూర్తవుతుండటంతో గవర్నర్ నరసింహన్ ఆయనకు లేఖ రాశారు.

రాజ్యాంగం ప్రకారం మీరు ఏ చట్ట సభకు ఎన్నిక కానందున వెంటనే రాజీనామా చేయమని కిడారి శ్రవణ్‌కు గవర్నర్ అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు ఏపీ ప్రభుత్వానికి కూడా సమాచారం అందించారు.

మరోవైపు మంత్రి పదవి కోల్పోతుండటంతో శ్రవణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు తెలుస్తోంది. ఆయన సూచన మేరకు ఏం చేయాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

First Published:  8 May 2019 12:37 AM GMT
Next Story