Telugu Global
Health & Life Style

వంకాయ కూరల్లోనే కాదు... ఆరోగ్యానికి రారాజు

వంకాయ. కూరల్లో రారాజు. ముచ్చటగా మూడు రంగుల్లో మెరిసే వంకాయలో రుచే కాదు… అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది ఆహార ప్రియులకు ఇష్టమైన కూరల్లో ఒకటి. వంకాయ వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి తెలుసుకొంటే అది ఎంత మంచిదో తెలుస్తుంది. వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తుంది. ఇందులోని చ్లోరోగేనిక్ యాసిడ్ ప్రధాన యాంటి ఆక్సిడెంటుగా పరిగణిస్తారు. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే వ్యాధులను నిరోధించడానికి […]

వంకాయ కూరల్లోనే కాదు... ఆరోగ్యానికి రారాజు
X

వంకాయ. కూరల్లో రారాజు. ముచ్చటగా మూడు రంగుల్లో మెరిసే వంకాయలో రుచే కాదు… అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది ఆహార ప్రియులకు ఇష్టమైన కూరల్లో ఒకటి. వంకాయ వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి తెలుసుకొంటే అది ఎంత మంచిదో తెలుస్తుంది.

  • వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తుంది. ఇందులోని చ్లోరోగేనిక్ యాసిడ్ ప్రధాన యాంటి ఆక్సిడెంటుగా పరిగణిస్తారు. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే వ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుంది.
  • వంకాయను క్రమం తప్పకుండా తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు సాధారణ స్థాయిలో ఉంచేందుకు కూడా వంకాయ సహాయపడుతుంది.
  • వంకాయలో పైటో న్యూట్రియాంట్స్ ఉన్నాయి. ఇవి కణాలలో ఎలాంటి నష్టం జరగకుండా చేస్తాయి. వంకాయను తరచుగా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు.
  • శరీరంలో ఉన్న అదనపు ఐరన్ ను తగ్గించడంలో వంకాయ ఎంతో శ్రేష్టమైనది. పోలి సైతేమియా వ్యాధి సోకిన రోగులకు వంకాయ ఎంతో ఉపయోగ పడుతుంది.
  • వంకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంది. ఇది అంటువ్యాధులు సోకకుండా… అవి వ్యాప్తి చెందకుండా చేస్తుంది.
  • రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో వంకాయది ప్రధమస్థానం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఆరోగ్యానికి రక్షణ కవచం వంటివి.
  • వంకాయలో ఉన్న కొన్ని ఎంజైములు జుట్టు మూలాలను గట్టి పరుస్తుంది. అంతే కాదు జుట్టు పెరుగుదలకు కూడా వంకాయ ఎంతో మేలు చేస్తుంది.
First Published:  7 May 2019 9:56 PM GMT
Next Story