Telugu Global
NEWS

చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్

చంద్ర బాబుకు సుప్రీం కోర్టు షాకిచ్చింది.. ఈవీఎంల అక్రమాలపై గొంతెత్తి సగం వీవీప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సహా దేశంలోని విపక్షాలన్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఒకటే గోల చేస్తున్నారు చంద్రబాబు. తాజాగా మంగళవారం సుప్రీం కోర్టు ఈ విషయమై విచారణ జరిపింది. కేసులో ఎటువంటి వాదనలు వినకుండానే కేసును సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే ఏపీ ఎన్నికల్లో ఈసీకి, చంద్రబాబుకు పడట్లేదు. అందుకే ఈసీ అక్రమాలంటూ ఆయన ఆరోపించారు. […]

చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్
X

చంద్ర బాబుకు సుప్రీం కోర్టు షాకిచ్చింది.. ఈవీఎంల అక్రమాలపై గొంతెత్తి సగం వీవీప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు సహా దేశంలోని విపక్షాలన్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఒకటే గోల చేస్తున్నారు చంద్రబాబు. తాజాగా మంగళవారం సుప్రీం కోర్టు ఈ విషయమై విచారణ జరిపింది. కేసులో ఎటువంటి వాదనలు వినకుండానే కేసును సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

ఇప్పటికే ఏపీ ఎన్నికల్లో ఈసీకి, చంద్రబాబుకు పడట్లేదు. అందుకే ఈసీ అక్రమాలంటూ ఆయన ఆరోపించారు. ఈసీపై పైచేయి సాధించాలన్న పట్టుదలతో నానా యాగీ చేశారు. చివరకు 21 పార్టీలతో కలిసి సుప్రీం గడప తొక్కారు. కానీ మొత్తంగా బాబుకు సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

ఈవీఎం వీవీ ప్యాట్ల లెక్కింపు వివాదంపై ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తొలిసారి సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత కేసుల విషయంలో కూడా హాజరు కాని బాబు ఇలా వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. కానీ సుప్రీం కోర్టు బాబు కోరికను మన్నించలేదు. ఈ కేసును కొట్టివేసింది. మరిప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.

అయితే ఈసీ ఇప్పటికే నియోజకవర్గానికి 5 వీవీ ప్యాట్లను లెక్కించాలని నిర్ణయించింది. అయితే 50శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు వాదించారు. ఈవీఎంల విషయంలో చంద్రబాబు తప్ప ఇతర పార్టీల నేతలెవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు.

First Published:  7 May 2019 3:07 AM GMT
Next Story