Telugu Global
Cinema & Entertainment

భారీ బడ్జెట్ చిత్రంలో 'అనూ ఇమాన్యుల్'?

‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళం బ్యూటీ అనూ ఇమాన్యుల్ కెరీర్ లో హిట్ సినిమాల కంటే డిజాస్టర్ అయిన చిత్రాల సంఖ్య ఎక్కువ. గత ఏడాది ఈమె హీరోయిన్ గా నటించిన మూడు సినిమాలు ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ డిజాస్టర్లుగా మారాయి. ఆ తర్వాత ఈమె మళ్ళీ మరొక సినిమా కు సైన్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం అనూ ఇమాన్యుల్ కు […]

భారీ బడ్జెట్ చిత్రంలో అనూ ఇమాన్యుల్?
X

‘మజ్ను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళం బ్యూటీ అనూ ఇమాన్యుల్ కెరీర్ లో హిట్ సినిమాల కంటే డిజాస్టర్ అయిన చిత్రాల సంఖ్య ఎక్కువ.

గత ఏడాది ఈమె హీరోయిన్ గా నటించిన మూడు సినిమాలు ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ డిజాస్టర్లుగా మారాయి. ఆ తర్వాత ఈమె మళ్ళీ మరొక సినిమా కు సైన్ చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం అనూ ఇమాన్యుల్ కు ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ దక్కిందట. టాలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేశారట. ఈ సినిమా ఒక భారీ బడ్జెట్ చిత్రం అని తెలుస్తోంది.

పాండిరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా అను ఇమాన్యుల్ కెరీర్ కి చాలా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో అయినా అను ఇమాన్యుల్ ఒక మంచి బ్రేక్ అందుకుంటుందో లేదో చూడాలి.

First Published:  7 May 2019 5:00 AM GMT
Next Story