Telugu Global
Cinema & Entertainment

మళ్లీ బాలీవుడ్ పై కన్నేసిన క్రిష్

టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరున్న క్రిష్ కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి వచ్చినట్లు లేదు. ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు భాగాలు భారీ డిజాస్టర్లుగా మారాయి. మరొకవైపు బాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వం వహించిన ‘మణికర్ణికా’ సినిమా దర్శకత్వం విషయంలో చెలరేగిన వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే కంగనా రనౌత్ తో కలిసి ఇకముందు ఎప్పుడూ సినిమా చేయనని చెప్పేశాడు క్రిష్. కానీ తాజాగా క్రిష్ దృష్టి మళ్లీ బాలీవుడ్ పైకి మళ్ళినట్లు […]

మళ్లీ బాలీవుడ్ పై కన్నేసిన క్రిష్
X

టాలీవుడ్ లో దర్శకుడిగా మంచి పేరున్న క్రిష్ కు ఈ ఏడాది ఏమాత్రం కలిసి వచ్చినట్లు లేదు. ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు భాగాలు భారీ డిజాస్టర్లుగా మారాయి. మరొకవైపు బాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వం వహించిన ‘మణికర్ణికా’ సినిమా దర్శకత్వం విషయంలో చెలరేగిన వివాదాల గురించి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే కంగనా రనౌత్ తో కలిసి ఇకముందు ఎప్పుడూ సినిమా చేయనని చెప్పేశాడు క్రిష్. కానీ తాజాగా క్రిష్ దృష్టి మళ్లీ బాలీవుడ్ పైకి మళ్ళినట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా బాలీవుడ్ లో ఒక హిట్ అందుకోవాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట.

తాజా సమాచారం ప్రకారం దర్శకుడు క్రిష్ ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి ఒక కథ వినిపించాడట. ఆ కథ అక్షయ్ కుమార్ కి కూడా నచ్చిందని వార్తలు బయటకు వస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

అయితే అక్షయ్ కుమార్ చేతిలో ఇప్పటికే బోలెడు ప్రాజెక్టులు ఉన్నాయి. వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు అక్షయ్ కుమార్. కాబట్టి అక్షయ్ కుమార్ కమిట్ మెంట్లు అన్నీ పూర్తయిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

First Published:  5 May 2019 11:05 PM GMT
Next Story