Telugu Global
Cinema & Entertainment

అందరికీ ఆ సీతే దిక్కు

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. మొత్తం అంతా సీత సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అలా గంపెడాశలతో తెరకెక్కిన సినిమా సీత పోస్ట్ పోన్ అవ్వడం, వీళ్లందర్నీ మరింత టెన్షన్ కు గురిచేస్తోంది. ఇంతకీ సీత ఎందుకంత కీలకంగా మారిందో ఓసారి చూద్దాం. జయజానకి నాయక కాస్ట్ ఫెయిల్యూర్. సాక్ష్యం కూడా కాస్ట్ ఫెయిల్యూర్, కవచం సినిమా డిజాస్టర్.. ఇలాంటి 3 సినిమాల తర్వాత సీత వస్తోంది. ఇది కూడా ఫ్లాప్ అయితే బెల్లంకొండ తట్టుకోలేడు. అందుకే సీతపైనే […]

అందరికీ ఆ సీతే దిక్కు
X

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. మొత్తం అంతా సీత సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అలా గంపెడాశలతో తెరకెక్కిన సినిమా సీత పోస్ట్ పోన్ అవ్వడం, వీళ్లందర్నీ మరింత టెన్షన్ కు గురిచేస్తోంది. ఇంతకీ సీత ఎందుకంత కీలకంగా మారిందో ఓసారి చూద్దాం.

జయజానకి నాయక కాస్ట్ ఫెయిల్యూర్. సాక్ష్యం కూడా కాస్ట్ ఫెయిల్యూర్, కవచం సినిమా డిజాస్టర్.. ఇలాంటి 3 సినిమాల తర్వాత సీత వస్తోంది. ఇది కూడా ఫ్లాప్ అయితే బెల్లంకొండ తట్టుకోలేడు. అందుకే సీతపైనే ఈ హీరో అశలన్నీ పెట్టుకున్నాడు.

కాజల్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. కవచం ఫ్లాప్. అంతకంటే ముందొచ్చిన సినిమాలు కూడా పెద్దగా క్రేజ్ తీసుకురాలేదు. ఇలాంటి టైమ్ లో ఓ మంచి పాత్రతో సీత సినిమా చేసింది. మూవీలో బెల్లంకొండ క్యారెక్టర్ కంటే కాజల్ పాత్రే బాగుంటుందట. ఈ సినిమా హిట్ అయితే మరోసారి క్రేజ్ కొట్టేద్దామని చూస్తోంది కాజల్.

వీళ్లిద్దరితో పాటు దర్శకుడు తేజ, విలన్ సోనూసూద్, మరో హీరోయిన్ మన్నారా చోప్రా, మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్.. ఇలా టోటల్ టీం అంతా సీతపై నమ్మకం పెట్టుకున్నారు. వీళ్లందరి గత సినిమాలు ఫ్లాపులయ్యాయి. సీత హిట్ అయితేనే వీళ్లకు మార్కెట్. లేదంటే అంతే సంగతులు. అన్నట్టు ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఈనెల 24న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  5 May 2019 6:30 AM GMT
Next Story