Telugu Global
Cinema & Entertainment

పూజా హెగ్డేపై హరీష్ క్లారిటీ

తన సినిమాకు సంబంధించి తనకు తెలియకుండానే ఓ క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ దర్శకుడు ప్రస్తుతం జిగర్తాండా సినిమాకు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ సందేశ్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఓ కీలక పాత్ర కోసం పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఆమెకు భారీగా పారితోషికం ఇచ్చారంటూ వచ్చిన వార్తల్ని హరీష్ ఖండించాడు. వాల్మీకి సినిమాలో ఓ పాత్ర కోసం పూజా హెగ్డేకు భారీగా […]

పూజా హెగ్డేపై హరీష్ క్లారిటీ
X

తన సినిమాకు సంబంధించి తనకు తెలియకుండానే ఓ క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ దర్శకుడు ప్రస్తుతం జిగర్తాండా సినిమాకు రీమేక్ గా వాల్మీకి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ సందేశ్ నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఓ కీలక పాత్ర కోసం పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ సినిమా కోసం ఆమెకు భారీగా పారితోషికం ఇచ్చారంటూ వచ్చిన వార్తల్ని హరీష్ ఖండించాడు.

వాల్మీకి సినిమాలో ఓ పాత్ర కోసం పూజా హెగ్డేకు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చామనే వార్తలో నిజం లేదంటూ ట్వీట్ చేశాడు హరీష్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో అసలు పూజా హెగ్డే ఉందనే విషయాన్నే ఇంకా యూనిట్ నిర్థారించలేదు. అదింకా పుకారు స్టేజ్ లోనే ఉంది. రేపోమాపో అఫీషియల్ గా ప్రకటిద్దాం అనుకున్నారు. తన తాజా ట్వీట్ తో వాల్మీకిలో పూజా ఉందనే విషయాన్ని తనకు తెలియకుండానే బయటపెట్టాడు హరీష్ శంకర్.

ఈ సినిమాలో పూజా హెగ్డే నటించనుందని, ఆమె పాత్ర కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తుందనే విషయం చాన్నాళ్ల కిందటే బయటకు వచ్చింది. అంతేకాదు, హరీష్ చెబుతున్నదాంట్లో కూడా నిజం లేదు. ఈ సినిమా కోసం కాస్త భారీగానే చార్జ్ చేస్తోంది పూజా. కేవలం 15 రోజుల కాల్షీట్ల కోసమే పూజాకు భారీగా డబ్బు ఇచ్చారట మేకర్స్.

First Published:  4 May 2019 2:18 AM GMT
Next Story