Telugu Global
NEWS

ఔనా.... అలా జరిగిందా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి భారీగానే దెబ్బ తగిలిందా? తాము ఇక గెలవమని అనుకున్న చోట పార్టీ శ్రేణులు అధినేత చంద్రబాబుకు భారీగానే షాక్ ఇచ్చారా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలు లభిస్తున్నాయని అంటున్నారు. చాలా జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోవడమే కాకుండా, కొందరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు సూచించినట్టు తెలుస్తోంది. తమ అభ్యర్థి ఎలాగూ గెలవడని నిర్ధారణకు వచ్చాకనే వారు వైసీపీ పట్ల మొగ్గు చూపారని […]

ఔనా.... అలా జరిగిందా?
X

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి భారీగానే దెబ్బ తగిలిందా? తాము ఇక గెలవమని అనుకున్న చోట పార్టీ శ్రేణులు అధినేత చంద్రబాబుకు భారీగానే షాక్ ఇచ్చారా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలు లభిస్తున్నాయని అంటున్నారు.

చాలా జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల నుంచి వెళ్లిపోవడమే కాకుండా, కొందరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు సూచించినట్టు తెలుస్తోంది. తమ అభ్యర్థి ఎలాగూ గెలవడని నిర్ధారణకు వచ్చాకనే వారు వైసీపీ పట్ల మొగ్గు చూపారని అంటున్నారు. స్ధానిక పరిస్థితులే ఇందుకు కారణమని కూడా చెబుతున్నారు.

రేపు తాము అధికారంలోకి రాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే వారు ఇలా చేశారని సమాచారం. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు ఇప్పుడిప్పుడే చేరుతున్నాయని, దీంతో ఆయన పార్టీ శ్రేణుల మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. తానెంతగా చెబుతున్నా క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు అనుకున్నంతగా కష్టపడలేదని మండిపడుతున్నారని చెబుతున్నారు.

అయినా పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు అలాంటి వారి పని పడతానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదేమి లాజిక్కో అర్థం కాక వారు తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు.

మరోవైపు మహిళల మనోగతం కూడా క్రమక్రమంగా బయటకు వస్తోందని, వారు టీడీపీకి ఓటు వేయలేదనే విషయం అర్థం కావడంతోనే చంద్రబాబు పార్టీ శ్రేణుల మీద చిర్రుబుర్రులాడుతున్నారని అంటున్నారు.

అయితే పసుపు కుంకుమ డబ్బులు సకాలంలో అందరికీ చేరలేదని, చాలాచోట్ల బ్యాంకర్లు మహిళల అకౌంట్లలో డబ్బులు వేయడానికి జాప్యం చేశారని, కొన్ని చోట్ల అయితే అసలు డబ్బులే వేయలేదని దిగువస్థాయి నేతలు చాలా మంది చంద్రబాబు దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఇదే విషయం మీద క్లారిటీ తీసుకోవడానికి ఓ ఉన్నతాధికారిని సమీక్షకు పిలిస్తే, ఆయన ఎన్నికల నిబంధనల పేరు చెప్పి తప్పించుకున్నారని తెలుస్తోంది.

దీంతో చంద్రబాబు మరింత చీకాకును ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. ‘‘నిజమే చంద్రబాబు అన్ని విధాలుగా టీడీపీ గెలుపు కోసం చాలా ప్రయత్నాలే చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేనపుడు మేం మాత్రం ఏం చేయగలం‘‘ అని పార్టీ శ్రేణులు వాపోతున్నారని తెలుస్తోంది.

First Published:  4 May 2019 12:11 AM GMT
Next Story