Telugu Global
Cinema & Entertainment

లైకా స్థానంలో రిలయన్స్?

దర్శకుడు శంకర్  ఈ మధ్యనే ‘2.ఓ’ సినిమాతో హిట్ అందుకోకపోయినా భారీ వసూళ్ళనే రాబట్టగలిగాడు.  ఈ దర్శకుడు తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టైటిల్ చూస్తేనే ఈ చిత్రం ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమాకు బడ్జెట్ తడిసి మోపెడవుతుండడంతో లైకా వారు ఈ […]

లైకా స్థానంలో రిలయన్స్?
X

దర్శకుడు శంకర్ ఈ మధ్యనే ‘2.ఓ’ సినిమాతో హిట్ అందుకోకపోయినా భారీ వసూళ్ళనే రాబట్టగలిగాడు. ఈ దర్శకుడు తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ‘భారతీయుడు 2’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

టైటిల్ చూస్తేనే ఈ చిత్రం ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా ఈ సినిమాకు బడ్జెట్ తడిసి మోపెడవుతుండడంతో లైకా వారు ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు గా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ విషయమై దర్శకుడు శంకర్ కూడా మౌనం వహించడం మరిన్ని పుకార్లకు దారితీసింది.

మరోవైపు కమల్ హాసన్ కూడా రాజకీయ పనుల్లో బిజీ అయిపోయాడు. ఎన్నికలు పూర్తయ్యే లోపల ఈ విషయమై ఏదో ఒక క్లారిటీ వస్తుందిలే అని అందరూ అనుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శంకర్ ఈ చిత్ర నిర్మాణం కోసం రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ను సంప్రదించాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే లైకా ప్రొడక్షన్స్ బదులు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ రంగంలోకి దిగనుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ చిత్ర షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

First Published:  4 May 2019 12:08 AM GMT
Next Story