Telugu Global
NEWS

వైసీపీపై చంద్రబాబు ఆరోపణల వెనుక కారణమిదే....

తనదే అధికారం అంటున్నాడు.. ఈసారి మళ్లీ టీడీపీదే పీఠం అంటున్నాడు. కానీ లోలోపల భయం టీడీపీ అధినేత చంద్రబాబును వెంటాడుతోంది. ఎంత ధీమాగా ఉన్నా సరే టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలపై పట్టును నిలుపుకోలేకపోతున్నాడట. సహజంగా అధికార పక్షంలోకే వలసలు పెరుగుతాయి. కానీ మొన్నటి ఎన్నికల వేల ప్రతిపక్షంలోకి కూడా భారీగా టీడీపీ నేతలు జంప్ అయ్యారు. కానీ జగన్ రాజీనామా చేస్తేనే తీసుకున్నారు. కానీ బాబుకు మాత్రం అంత ధైర్యం లేక ఎవరొచ్చినా తీసుకొని […]

వైసీపీపై చంద్రబాబు ఆరోపణల వెనుక కారణమిదే....
X

తనదే అధికారం అంటున్నాడు.. ఈసారి మళ్లీ టీడీపీదే పీఠం అంటున్నాడు. కానీ లోలోపల భయం టీడీపీ అధినేత చంద్రబాబును వెంటాడుతోంది. ఎంత ధీమాగా ఉన్నా సరే టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలపై పట్టును నిలుపుకోలేకపోతున్నాడట.

సహజంగా అధికార పక్షంలోకే వలసలు పెరుగుతాయి. కానీ మొన్నటి ఎన్నికల వేల ప్రతిపక్షంలోకి కూడా భారీగా టీడీపీ నేతలు జంప్ అయ్యారు. కానీ జగన్ రాజీనామా చేస్తేనే తీసుకున్నారు. కానీ బాబుకు మాత్రం అంత ధైర్యం లేక ఎవరొచ్చినా తీసుకొని కాలం గడిపారు.

ఇప్పుడు వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుందని అంతటా చర్చ జరుగుతోంది. బాబు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా కానీ ఆయనలోనూ భయం ఉంది. అందుకే వైసీపీ ఇప్పుడు తమ ఎమ్మెల్యే అభ్యర్థులను లాగేసుకుంటోందని బాబు వాపోతున్నారు. అంటే బాబు చెబుతున్నది సుద్ద అబద్దమని అర్థమవుతోంది..

చంద్రబాబు అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అధికారంలోకి వస్తే .. అధికార పార్టీని కాదని ఎవరూ వైసీపీలోకి వెళ్లరు. ఇప్పుడు వెళుతున్నారంటే టీడీపీ గెలవదనేగా అర్థం. ఇలా తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ కాజేస్తున్నాడని బాబు అనడం అంటే నైతికంగా ఓటమిని అంగీకరించినట్టే లెక్క. అలా అధికారం ఈసారి నూటికి నూరు శాతం వైసీపీదేనని బాబు కూడా ఒప్పేసుకున్నట్టేనని అర్థమవుతోంది.

ఇలా ఎన్నికల ఫలితాలకు ముందే బాబు కాడి వదిలేశాడు. వైసీపీ వైపు టీడీపీ నేతలు చూడడం చూస్తుంటే పరిస్థితి కూడా తేటతెల్లం అవుతోంది. ఈ లెక్కన టీడీపీ ఓటమి, వైసీపీ గెలుపు ఖాయమైందన్న అంచనాలు పెరుగుతున్నాయి.

First Published:  3 May 2019 6:48 AM GMT
Next Story