Telugu Global
Cinema & Entertainment

విడుదలై 4 వారాలు.... ఇప్పటికీ వసూళ్లు

కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నాగచైతన్య. సమంతతో కలిసి ఈ హీరో చేసిన మజిలీ సినిమా తాజాగా 38 కోట్ల 52 లక్షల రూపాయల షేర్ సాధించింది. 40 కోట్ల రూపాయల క్లబ్ లోకి త్వరలోనే ఎంటర్ కాబోతోంది. క్లబ్ లోకి ఎంటరైతే, చైతూ కెరీర్ లో 40 కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది మజిలీ. నిన్నటితో నెల రోజులు (4 వారాలు) పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పటికే కాస్తోకూస్తో వసూళ్లు […]

విడుదలై 4 వారాలు.... ఇప్పటికీ వసూళ్లు
X

కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నాగచైతన్య. సమంతతో కలిసి ఈ హీరో చేసిన మజిలీ సినిమా తాజాగా 38 కోట్ల 52 లక్షల రూపాయల షేర్ సాధించింది. 40 కోట్ల రూపాయల క్లబ్ లోకి త్వరలోనే ఎంటర్ కాబోతోంది. క్లబ్ లోకి ఎంటరైతే, చైతూ కెరీర్ లో 40 కోట్ల షేర్ సాధించిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది మజిలీ.

నిన్నటితో నెల రోజులు (4 వారాలు) పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పటికే కాస్తోకూస్తో వసూళ్లు సాధిస్తూనే ఉంది. నిర్మాతలు, బయ్యర్లకు లాభాలు అందిస్తూనే ఉంది. ఇప్పటివరకు 68 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా, అటు ఓవర్సీస్ లో కూడా 4 కోట్ల రూపాయల వసూళ్లతో చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ఇక ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 28 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 13.02 కోట్లు
సీడెడ్ – రూ. 4.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.52 కోట్లు
ఈస్ట్ – రూ. 1.82 కోట్లు
వెస్ట్ – రూ. 1.38 కోట్లు
గుంటూరు – రూ. 2.08 కోట్లు
కృష్ణా – రూ. 1.85 కోట్లు
నెల్లూరు – రూ. 0.93 కోట్లు

First Published:  3 May 2019 5:06 AM GMT
Next Story