Telugu Global
Cinema & Entertainment

కాంచన-3... ప్రస్తుతానికి 7 కోట్లు లాభం

థియేట్రికల్ బిజినెస్, బ్రేక్-ఈవెన్ తో పోల్చి చూసుకుంటే జెర్సీ కంటే కాంచన-3 చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఇప్పటికే బ్రేక్-ఈవెన్ సాధించిన ఈ సినిమా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎంటరైంది. మహర్షి విడుదలయ్యేంత వరకు ఈ సినిమాకు లాభాలు వస్తాయని అంచనా వేస్తోంది ట్రేడ్. కాంచన-3 సినిమాను తెలుగులో 11 కోట్ల రూపాయలకు అమ్మారు. ఈ 14 రోజుల్లో సినిమాకు 17 […]

కాంచన-3... ప్రస్తుతానికి 7 కోట్లు లాభం
X

థియేట్రికల్ బిజినెస్, బ్రేక్-ఈవెన్ తో పోల్చి చూసుకుంటే జెర్సీ కంటే కాంచన-3 చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఇప్పటికే బ్రేక్-ఈవెన్ సాధించిన ఈ సినిమా బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది. నిన్నటితో 2 వారాల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎంటరైంది. మహర్షి విడుదలయ్యేంత వరకు ఈ సినిమాకు లాభాలు వస్తాయని అంచనా వేస్తోంది ట్రేడ్.

కాంచన-3 సినిమాను తెలుగులో 11 కోట్ల రూపాయలకు అమ్మారు. ఈ 14 రోజుల్లో సినిమాకు 17 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అంటే అటుఇటుగా సినిమాకు 7 కోట్ల రూపాయల లాభం అన్నమాట. 2 వారాల్లో జెర్సీ సినిమా బ్రేక్-ఈవెన్ అయితే, అదే 2 వారాల్లో కాంచన-3 సినిమా 7 కోట్ల లాభం ఆర్జించి పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ 14 రోజుల్లో.. కాంచన-3 సినిమాకు ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 5.82 కోట్లు
సీడెడ్ – రూ. 3.61 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.47 కోట్లు
ఈస్ట్ – రూ. 1.53 కోట్లు
వెస్ట్ – రూ. 1.12 కోట్లు
గుంటూరు – రూ. 1.30 కోట్లు
నెల్లూరు – రూ. 0.64 కోట్లు
కృష్ణా – రూ. 1.29 కోట్లు

First Published:  3 May 2019 11:03 AM GMT
Next Story