Telugu Global
Health & Life Style

ఖర్జూరం... ఆరోగ్యానికి బంగారం

ఆహారం జీర్ణం కావడానికి, శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు దివ్యౌషధం ఖర్జూరం. ఇతర డ్రైఫ్రూట్స్ కంటే ఖర్జూరం ఎక్కువ మేలు చేస్తుంది. శరీరానికి ఎక్కువ పోషకాలు అందించడంలో ఖర్జూరానిదే పైచేయి. అందుకే డాక్టర్లు ఖర్జూరం ఎక్కువగా తినాలని సూచిస్తారు. ఖర్జూరం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం. ఖర్జూరంలో పొటాషియం పాళ్లు ఎక్కువ. ఇవి గుండె కండరాలు సమర్ధవంతంగా పని చేయడానికి ఉపయోగపడతాయి. మద్యం ఎక్కువగా తీసుకునే వారికి, మత్తు పదార్ధాలకు అలవాటు పడిన వారికి […]

ఖర్జూరం... ఆరోగ్యానికి బంగారం
X

ఆహారం జీర్ణం కావడానికి, శరీరానికి తక్షణ శక్తిని అందించేందుకు దివ్యౌషధం ఖర్జూరం. ఇతర డ్రైఫ్రూట్స్ కంటే ఖర్జూరం ఎక్కువ మేలు చేస్తుంది. శరీరానికి ఎక్కువ పోషకాలు అందించడంలో ఖర్జూరానిదే పైచేయి. అందుకే డాక్టర్లు ఖర్జూరం ఎక్కువగా తినాలని సూచిస్తారు. ఖర్జూరం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం.

  • ఖర్జూరంలో పొటాషియం పాళ్లు ఎక్కువ. ఇవి గుండె కండరాలు సమర్ధవంతంగా పని చేయడానికి ఉపయోగపడతాయి.
  • మద్యం ఎక్కువగా తీసుకునే వారికి, మత్తు పదార్ధాలకు అలవాటు పడిన వారికి గింజ తీసేసిన ఖర్జూరాన్ని రసం తీసి రోజూ రెండు పూటలా తాగిస్తే ఎంతో మేలు చేస్తుంది.
  • మలబద్దకంతో బాధపడే వారికి ఖర్జూరం దివ్యౌషధం. ఖర్జూరం పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే మలబద్దకం సమస్య పోతుంది. అంతే కాదు… ఇందులో ఉన్న ఫైబర్, పొటాషియం మలబద్దకం సమస్య నుంచి బయటపడేందుకు సహకరిస్తాయి.
  • ఖర్జూరంలో విటమిన్ ఎ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. రేచీకటితో ఉన్న వారికి విటమిన్ ఎ ఎంతో అవసరం. అలాంటి వారు నిత్యం ఖర్జూరాన్ని తినడం ద్వారా రేచీకటి సమస్య నుంచి బయటపడవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
  • గర్భిణీలకు ఫోలిక్‌యాసిడ్‌ ఎంతో అవసరం. ఖర్జూరంలో ఇది చాలా ఎక్కువగా ఉంది. అందుకని గర్భణీలు ఖర్జూరాన్ని నిత్యం తీసుకుంటే మంచిది. పైగా ఇందులో ఉండే ఐరన్‌ గర్భిణిలకు మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
  • క్యాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్, సెలీనియం పుష్కలంగా ఉన్న పండు ఖర్జూరమేనని వైద్య నిపుణుల అభిప్రాయం. అందుకని ఈ ఖనిజాలు గర్భంలోని పిండం ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని అంటున్నారు.
  • గర్భణీలే కాదు…. వివిధ వ్యాధులతో సతమతమవుతున్న మహిళలంతా ఖర్జూరాన్ని ప్రతి రోజూ తీనడం వల్ల అనేక రుగ్మతల నుంచి బయటపడవచ్చు. ప్రతి వంద గ్రాముల ఖర్జూరంలో 7.3 మిల్లీగ్రాముల ఐరన్ ఉందని ఓ అంచనా. ఇది హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలకు మేలు చేస్తుంది.
  • నేటి గజిబిజి జీవితంలో అనేక మంది కీళ్ళ నొప్పులతోను, ఎముకలకు సంబంధించిన వ్యాధులతోనూ బాధపడుతున్నారు. శరీరంలో కాల్షియం స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది డాక్టర్ల అభిప్రాయం. ఖర్జూరంలో క్యాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. దీంతో వీటిని తరచూ తినడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు.
  • దంత సమస్యలకు కూడా ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది. ఈ పండ్లను తరచూ తినడం వల్ల దంత క్షయాన్ని నిరోధించడమే కాకుండా డెంటల్ ప్లాక్ ను కూడా నిరోధించవచ్చు.
  • ఎండలు మండిపోతున్న నేటి తరుణంలో పిల్లలు, పెద్దల్లో తక్షణ శక్తిని నింపాలంటే ఖర్జూరాలు తినడమే చక్కని పరిష్కారం అంటున్నారు వైద్యులు. పైగా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్ధకు సహాయపడుతుంది.
  • ఖర్జూరం పళ్లను పాలలో వేసి బాగా మరిగించిన తర్వాత ఆ పాలు తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇక ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి వాటిని ఉదయాన్నేమిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగితే శరీరానికి న్యూట్రియన్స్ అధికంగా అందుతాయి.
  • ఖర్జూరాల్లో పెక్టిన్ అనే రసాయనం ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్ ను అదుపులో ఉంచుతాయి.
  • చికాకులు వేధిస్తున్నప్పుడు రెండు ఖర్జూరాలు తింటే మంచి మూడ్ లోకి వచ్చేస్తామని మానసిన నిపుణులు కూడా అంటున్నారు.
First Published:  2 May 2019 8:01 PM GMT
Next Story