Telugu Global
NEWS

మీరు రైతులను రెచ్చగొడతారా?.... మేము విద్యార్ధులను రెచ్చగొడతాం....

రాజకీయ పార్టీలు చేసే ఉద్యమాలు, ఆందోళనలు, కార్యాచరణ…. ప్రజాప్రయోజనాలకోసమో, దేశం కోసమో, రాష్ట్రం కోసమో అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయంటే, ఒక పని చేస్తున్నాయంటే…. దాని వెనుక పార్టీ ప్రయోజనాలే ముఖ్యమై కూర్చున్నాయి. రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యతగా ఉన్నంత కాలం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా కేంద్రం చూసి చూడనట్టు ఉంటుంది. అలాగే సంబంధాలు బాగున్నంత కాలం కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా రాష్ట్ర […]

మీరు రైతులను రెచ్చగొడతారా?....  మేము విద్యార్ధులను రెచ్చగొడతాం....
X

రాజకీయ పార్టీలు చేసే ఉద్యమాలు, ఆందోళనలు, కార్యాచరణ…. ప్రజాప్రయోజనాలకోసమో, దేశం కోసమో, రాష్ట్రం కోసమో అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయంటే, ఒక పని చేస్తున్నాయంటే…. దాని వెనుక పార్టీ ప్రయోజనాలే ముఖ్యమై కూర్చున్నాయి.

రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యతగా ఉన్నంత కాలం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా కేంద్రం చూసి చూడనట్టు ఉంటుంది. అలాగే సంబంధాలు బాగున్నంత కాలం కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు పలుకుతూ ఉంటాయి. ఒక్కసారి సంబంధాలు చెడగానే వాళ్ళకు వీళ్ళల్లో, వీళ్ళకు వాళ్ళల్లో అన్నీ లోపాలే కనిపిస్తుంటాయి.

ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఇలాంటి పరిస్థితే మొదలైనట్టుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకు అపనమ్మకం ఏర్పడుతున్నట్టు ఉంది.

నిజామాబాద్‌లో కవిత లోక్‌సభకు పోటీ చేసినప్పుడు స్థానిక రైతులు పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు. అలా రైతులు నామినేషన్లు వేయడం వెనుక బీజేపీ పార్టీ ప్రోత్సాహం కూడా ఉందని టీఆర్‌ఎస్‌ అనుమానం. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయి ప్రధాని పోటీచేస్తున్న వారణాసిలో తెలంగాణ రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి వెళ్ళడం వెనుక టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రోత్సాహం ఉందని బీజేపీ అనుమానిస్తోంది.

తెలంగాణలో ఇంటర్‌మీడియట్‌ ఫలితాల గందరగోళం పై బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం వెనుక అమిత్‌ షా ఉన్నాడని…. వారణాసిలో రైతుల చేత నామినేషన్లు వేయించింది టీఆర్‌ఎస్‌ అని ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులకు చెప్పి…. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి టీఆర్‌ఎస్‌ను బాగా ఇబ్బంది పెట్టండి అని చెప్పినట్టు సమాచారం.

First Published:  2 May 2019 3:40 AM GMT
Next Story