Telugu Global
NEWS

ముంబై వాంఖెడీలో ఐపీఎల్ బిగ్ ఫైట్

నువ్వానేనా అంటున్న ముంబై , హైదరాబాద్ రాత్రి 8 గంటల నుంచి డూ ఆర్ డై సమరం లీగ్ టేబుల్ 3, 4 స్థానాలలో ముంబై, హైదరాబాద్ నెగ్గినజట్టుకే ప్లే ఆఫ్ రౌండ్లో చోటు ఐపీఎల్ 12వ సీజన్ 51వ రౌండ్ మ్యాచ్ కు …ముంబై వాంఖెడీ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ డూ ఆర్ డై సమరంలో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటి […]

ముంబై వాంఖెడీలో ఐపీఎల్ బిగ్ ఫైట్
X
  • నువ్వానేనా అంటున్న ముంబై , హైదరాబాద్
  • రాత్రి 8 గంటల నుంచి డూ ఆర్ డై సమరం
  • లీగ్ టేబుల్ 3, 4 స్థానాలలో ముంబై, హైదరాబాద్
  • నెగ్గినజట్టుకే ప్లే ఆఫ్ రౌండ్లో చోటు

ఐపీఎల్ 12వ సీజన్ 51వ రౌండ్ మ్యాచ్ కు …ముంబై వాంఖెడీ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ డూ ఆర్ డై సమరంలో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఇప్పటి వరకూ ఆడిన 12 రౌండ్ల మ్యాచ్ ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించిన ముంబై మూడోస్థానంలో కొనసాగుతుంటే… సన్ రైజర్స్ మాత్రం 12 రౌండ్లలో 6 విజయాలతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇప్పటికే మెరుగైన రన్ రేట్ తో ఉన్న ముంబై…రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ 13వ రౌండ్ మ్యాచ్ లో నెగ్గితే నేరుగా క్వాలిఫైయర్స్ రౌండ్ చేరగలుగుతుంది. ఓడినా…వచ్చిన నష్టం ఏమీలేదు.

మరోవైపు…హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం…క్వాలిఫైయర్స్ రౌండ్ చేరాలంటే ప్రస్తుత 13వ రౌండ్ మ్యాచ్ లో నెగ్గితీరాల్సి ఉంది.

సర్వశక్తులూ కూడదీసుకొని ఆడగలిగితేనే హైదరాబాద్ విజయం సాధించగలుగుతుంది. ముంబైని ముంబై హోంగ్రౌండ్ వాంఖెడీలో ఓడించడం అంత తేలికకాదు.

ఒక్కమాటలో చెప్పాలంటే…ముంబైకి చెలగాటం…హైదరాబాద్ సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ సంకటంగా ఈమ్యాచ్ మారింది.

First Published:  2 May 2019 3:35 AM GMT
Next Story