Telugu Global
Cinema & Entertainment

తెలుగులో ఆడలేదు... హిందీలోనైనా ఆడుతుందా?

దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు వంద కి పైగా సినిమాలని తీసి ప్రేక్షకులని మెప్పించిన సంగతి తెలిసిందే. ఆయన తనయుడి గా సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన ప్రకాష్ కోవెలమూడి నటుడి గా అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత దర్శకుడి గా కూడా మారాడు. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈయన దర్శకత్వం లో ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించనున్నాడట. తెలుగు లో ఒకటి రెండు సినిమాలు తీసినా అవి పెద్దగా ఆడకపోవడం తో […]

తెలుగులో ఆడలేదు... హిందీలోనైనా ఆడుతుందా?
X

దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు వంద కి పైగా సినిమాలని తీసి ప్రేక్షకులని మెప్పించిన సంగతి తెలిసిందే. ఆయన తనయుడి గా సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన ప్రకాష్ కోవెలమూడి నటుడి గా అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత దర్శకుడి గా కూడా మారాడు.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈయన దర్శకత్వం లో ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటించనున్నాడట. తెలుగు లో ఒకటి రెండు సినిమాలు తీసినా అవి పెద్దగా ఆడకపోవడం తో ప్రకాష్ హిందీ పరిశ్రమ వైపు అడుగులు వేశాడు.

బాలీవుడ్ లో మెంటల్ హై క్యా అనే చిత్రాన్ని ప్రస్తుతం తీర్చిదిద్దే పని లో ఉన్నాడు. కంగనా రనౌత్ మరియు రాజ్ కుమార్ రావ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం లో షారుఖ్ ఒక ముఖ్య పాత్ర లో నటించనున్నట్లు సమాచారం.

జీరో ఫ్లాప్ అయిన తర్వాత పెద్దగా సినిమాలేమి చేయకుండా ఉన్న షారుఖ్ ఈ సినిమాలో నటించనున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో షారుఖ్ పాత్ర చిన్నదే…. కానీ ముఖ్యమైనది అని సమాచారం. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి ఆయ్యే అవకాశం ఉంది.

First Published:  2 May 2019 4:25 AM GMT
Next Story