Telugu Global
Cinema & Entertainment

ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో కృతిసనన్

తెలుగులో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నాగచైతన్య హీరోగా ‘దోచేయ్’ సినిమాలో కూడా కనిపించింది. కానీ ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఈ భామ ఈ మధ్యనే ‘బరేలి కి బర్ఫీ’, ‘లుకా చుప్పి’ వంటి సినిమాలతో మంచి విజయాలను సాధించింది. తాజాగా కృతిసనన్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టును సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దినేష్ విజన్ నిర్మాణంలో మరొక సినిమా చేసేందుకు […]

ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో కృతిసనన్
X

తెలుగులో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నాగచైతన్య హీరోగా ‘దోచేయ్’ సినిమాలో కూడా కనిపించింది. కానీ ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది.

ఈ భామ ఈ మధ్యనే ‘బరేలి కి బర్ఫీ’, ‘లుకా చుప్పి’ వంటి సినిమాలతో మంచి విజయాలను సాధించింది.

తాజాగా కృతిసనన్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టును సైన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దినేష్ విజన్ నిర్మాణంలో మరొక సినిమా చేసేందుకు సిద్ధమైంది కృతి. అయితే ఈ సినిమా మొత్తం సరోగసి కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుందట. స్క్రిప్ట్ వినగానే కథ మాత్రమే కాక తన పాత్ర కూడా బాగా నచ్చడంతో ఈ సినిమా కు వెంటనే ఓకే చెప్పేసింది కృతి. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కరీనాకపూర్ కలిసి నటిస్తున్న ‘గుడ్ న్యూస్’ సినిమా కూడా సరోగసీ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. కైరా అద్వానీ కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.

First Published:  30 April 2019 11:03 PM GMT
Next Story