Telugu Global
Health & Life Style

జీలకర్ర... అనారోగ్యంపై దుడ్డుకర్ర...

వంట ఇంట్లో ఉండే ప్రతి పదార్దం గురించి మనకు అవగాహన అవసరం. వంటలో వాడే ప్రతి వస్తువులోను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలకు తక్షణ ఉపశమనం…. పెద్ద సమస్యల నివారణకు మన వంటిల్లే ఆధారం. ఈ రోజు జీలకర్రలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం… జీలకర్రను జీరా అని హిందీలోను… కుమిన్ సీడ్స్ అని ఇంగ్లీష్ లోను పిలుస్తారు. జీలకర్రలో రెండు రకాలు. తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీరా […]

జీలకర్ర... అనారోగ్యంపై దుడ్డుకర్ర...
X

వంట ఇంట్లో ఉండే ప్రతి పదార్దం గురించి మనకు అవగాహన అవసరం. వంటలో వాడే ప్రతి వస్తువులోను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలకు తక్షణ ఉపశమనం…. పెద్ద సమస్యల నివారణకు మన వంటిల్లే ఆధారం. ఈ రోజు జీలకర్రలో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం…

జీలకర్రను జీరా అని హిందీలోను… కుమిన్ సీడ్స్ అని ఇంగ్లీష్ లోను పిలుస్తారు. జీలకర్రలో రెండు రకాలు. తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీరా అని కూడా అంటారు. రెంటిలోను ఔషద గుణాలు దాదాపు ఒకలాగానే ఉంటాయి. జీలకర్రలో అనేక ఆరోగ్య సమస్యలను నివారించే గుణాలు ఉన్నాయి.

  • జీలకర్రలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణాన రక్తహీనతను తగ్గించి…. శరీరంలో ఉన్న హిమోగ్లోబిన్ ను పెంచుతుంది.
  • ఎసిడిటి, అజీర్ణానికి జీలకర్రను మించిన మందు లేదనే చెప్పాలి. ఎసిడిటితో బాధపడుతున్న వారు కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు కలిపి నమిలితే మంచి ఫలితం ఉంటుంది.
  • గర్భణీలలో ఉండే మార్నింగ్ సిక్ నెస్ కు జీలకర్ర మంచి మందు. వికారం, వాంతులకు జీలకర్ర కషాయం తాగితే వెంటనే తేరుకుంటారు.
  • అజీర్ణం వల్ల వచ్చే కడుపు నొప్పి కొద్దిగా జీలకర్రతో మాయం. అజీర్ణం వల్ల విరోచనం కాకపోతే జీలకర్ర కషాయం తాగినా లేదా జీలకర్ర నమిలినా మంచి ఫలితం కనబడుతుంది.
  • జీలకర్రలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా గుణాలు మూత్రపిండాలను శుభ్రపరచి, వ్యర్ధాలను బయటకి పంపడంలో సాయపడుతాయి.
  • చుండ్రు నివారణకు బ్యూటీ పార్లలలో జీలకర్రను వాడుతారని అంటారు.
  • జీలకర్ర, తేనే, ఉప్పు, నెయ్యి కలపి మెత్తగా నూరి తేలు, జర్రి లేదా ఇతర క్రిములు కుట్టిన చోట పట్టు వేస్తే ఆ విషాన్ని హరిస్తుంది.
  • జీలకర్ర నల్లదబ్బ (spleen) సమస్యలను నివారిస్తుంది.
  • వాతం, పైత్యం, కఫం వంటి సమస్యలకు జీలకర్ర దివ్యౌషధం.
  • బాలింతలు జీలకర్ర తింటే పాలు సమృద్దిగా ఉంటాయి.
  • చిన్న పిల్లలకు జీలకర్ర పొడి వేసి అన్నంలో కలిపి మొదటి ముద్ద పెడితే వారికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  • వేసవి కాలంలో మజ్జిగలో కొద్దిగా జీలకర్రపొడి వేసుకుని తాగితే వడదెబ్బ తగలదు.
  • పైల్స్ వ్యాధితో బాధపడుతున్న వారు రోజూ పొద్దున, రాత్రి కొద్దిగా జీలకర్ర నమిలితే సుఖవిరోచనం అవుతుంది.
First Published:  29 April 2019 9:14 PM GMT
Next Story