Telugu Global
NEWS

వాళ్ళు అమ్మారు.... వీళ్ళు కొన్నారు.... మధ్యలో ఈ శివాజీ గోల ఏమిటో !

టీవీ9 శ్రీనిరాజు సంస్థ. 82 శాతం వాటాదారు ఆయన. ఈ సంస్థలో 14.29 శాతం మలేషియాకు చెందిన సైఫ్ పార్టనర్స్‌ది . శ్రీనిరాజు నుంచి మొత్తం షేర్లను మైహోం రామేశ్వర రావు, మేఘా కృష్ణారెడ్డి లు కొనుగోలు చేశారు. అయితే ఈ అమ్మకాన్ని సైఫ్ పార్టనర్స్ అభ్యంతర పెట్టారు. దానిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిచారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ రాజీ ఒప్పందం కుదిరినట్టు కోర్టుకు తెలిపారు. ఇప్పుడు తమ వాటా కూడా అమ్మడానికి సైఫ్ […]

వాళ్ళు అమ్మారు.... వీళ్ళు కొన్నారు.... మధ్యలో ఈ శివాజీ గోల ఏమిటో !
X

టీవీ9 శ్రీనిరాజు సంస్థ. 82 శాతం వాటాదారు ఆయన. ఈ సంస్థలో 14.29 శాతం మలేషియాకు చెందిన సైఫ్ పార్టనర్స్‌ది . శ్రీనిరాజు నుంచి మొత్తం షేర్లను మైహోం రామేశ్వర రావు, మేఘా కృష్ణారెడ్డి లు కొనుగోలు చేశారు. అయితే ఈ అమ్మకాన్ని సైఫ్ పార్టనర్స్ అభ్యంతర పెట్టారు. దానిపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయిచారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ రాజీ ఒప్పందం కుదిరినట్టు కోర్టుకు తెలిపారు. ఇప్పుడు తమ వాటా కూడా అమ్మడానికి సైఫ్ పార్టనర్స్ అంగీకరించినట్టు సమాచారం.

ఇరుపార్టీలు ఏప్రిల్ 29న జడ్జి ముందు హాజరై తమ రాజీ ప్రతిపాదనను, దానికి సంబంధించిన వివరాల అఫిడవిట్‌ను కోర్టు ముందు ఉంచారు. మీరు అన్నికేసులనూ ఉపసంహరించుకుంటున్నారా? అంటూ సైఫ్ పార్టనర్స్‌ను న్యాయమూర్తి అడిగినప్పుడు వాళ్ళు అవునని సమాధానం చెప్పారు. వివరాలన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తి అనంత పద్మనాభ స్వామి తన నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. వారం పదిరోజుల్లో ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది.

అమ్మడానికి వాళ్ళు అంగీకరించాక…. కొనడానికి వీళ్ళు సిద్ధపడ్డాక…. మధ్యలో ఎంతమంది ఎన్ని పురాణాలు చెప్పినా, ఎన్ని పుకార్లు రేపినా…. సోషల్ మీడియాలో ఈ గాలి వార్తలు చదువుకోవడానికి బాగుంటాయి గానీ…. ఫైనల్‌గా జరిగేది ఏమీ ఉండదు…. జనాలకు టైం వేస్ట్ తప్ప. షేర్ హోల్డర్లు ఇద్దరూ రాజీ పడ్డాక ఇక నాన్ షేర్ హోల్డర్లు ఈ అమ్మకాన్ని ఎలా అడ్డుకోగలరు? కంపెనీల చట్టం గురించి తెలిసిన వాళ్ళెవరికైనా ఈ విషయం స్పష్టమే.

వాట్సప్ గ్రూపుల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నట్టు…. కొన్నవాళ్ళు దిక్కుతోచక, జుట్టుపీక్కునే పరిస్థితి ఏమీ ఇక్కడ లేదు. వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. కార్పోరేటు వ్యవహారాలు, కంపెనీల చట్టం గురించి ప్రాధమిక విషయాలు తెలిసినవాళ్ళెవరూ ఇలాంటి వార్తలను పట్టించుకోరు.

మూడో కృష్ణుడు రంగ ప్రవేశం చేసినట్టు…. ఈ వార్తల మధ్యలో హీరో శివాజీ పేరు ప్రత్యక్షం అయింది. ఆయన 40 వేల షేర్లను కొనుగోలు చేశాడని…. కాబట్టి తన అనుమతిలేకుండా టీవీ9ను మీరు ఎలా కొనుగోలు చేస్తారని శివాజీ కోర్టును ఆశ్రయించాడని సోషల్ మీడియాలో కథలు కథలుగా పుకార్లు వస్తున్నాయి.

అయితే ఆయనకు అంత తక్కువ షేర్లు ఎవరు అమ్మారు అనేదానికి సమాధానం లేదు. టీవీ9 స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయిన కంపెనీ కాదు, ఓపెన్ మార్కెట్ లో షేర్లు కొనుక్కోవడానికి. కాబట్టి షేర్లు, షేర్ల లావాదేవీల ప్రసక్తే లేదు. మరి అలాంటప్పుడు శివాజీకి 40 వేల షేర్లు ఎవరు అమ్మారు?

బహుశా సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రాసే జర్నలిస్టులో లేదా టీవీ9 తనదే అని ఇప్పటికీ అనుకునే వ్యక్తులో అమ్మి ఉండాలి…!

ఒకవేళ శివాజీ ఆ షేర్లు కొన్నారే అనుకుందాం. మైనారిటీ షేర్ హోల్డర్‌గా ఈయన….. మెజారిటీ షేర్ హోల్డర్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఆపే శక్తి ఈ హీరో గారికి ఉందంటారా?

First Published:  29 April 2019 11:28 PM GMT
Next Story