Telugu Global
Cinema & Entertainment

కల్కి శాటిలైట్ కు భారీ డిమాండ్

గరుడవేగ అనే ఒకే ఒక్క సినిమా రాజశేఖర్ జీవితాన్ని మార్చేసింది. ఫేడ్ అవుట్ అయిపోయి, క్యారెక్టర్ రోల్స్ చేసుకుందామనే టైమ్ కు సూపర్ హిట్ అయింది గరుడవేగ. దీంతో హీరోగా తన నిడివిని మరో ఐదేళ్లకు పెంచుకున్నాడు రాజశేఖర్. హీరోగా మళ్లీ ఊపందుకోవడమే కాకుండా, తన మార్కెట్ కూడా పెంచుకున్నాడు. కల్కి సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్, ఇతర వ్యాపార లావాదేవీలు చూస్తే రాజశేఖర్ హవా అర్థమౌతుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ […]

కల్కి శాటిలైట్ కు భారీ డిమాండ్
X

గరుడవేగ అనే ఒకే ఒక్క సినిమా రాజశేఖర్ జీవితాన్ని మార్చేసింది. ఫేడ్ అవుట్ అయిపోయి, క్యారెక్టర్ రోల్స్ చేసుకుందామనే టైమ్ కు సూపర్ హిట్ అయింది గరుడవేగ. దీంతో హీరోగా తన నిడివిని మరో ఐదేళ్లకు పెంచుకున్నాడు రాజశేఖర్. హీరోగా మళ్లీ ఊపందుకోవడమే కాకుండా, తన మార్కెట్ కూడా పెంచుకున్నాడు. కల్కి సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్, ఇతర వ్యాపార లావాదేవీలు చూస్తే రాజశేఖర్ హవా అర్థమౌతుంది.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. నిర్మాత రాధామోహన్, ఈ సినిమాకు సంబంధించిన ఏపీ, నైజాం థియేట్రికల్ రైట్స్ ను హోల్ సేల్ గా దక్కించుకున్నారు. భారీ మొత్తానికే ఈ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ విభాగంలో కూడా కల్కి సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది.

కల్కి శాటిలైట్ రైట్స్ కోసం తెలుగు ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్ల మధ్య జోరుగా పోటీ నడుస్తోంది. మొన్నటివరకు 2 కోట్లు అనుకున్న డీల్ కాస్తా ఇప్పుడు 5 – 6 కోట్ల మధ్య నడుస్తున్నట్టు తెలుస్తోంది. అటు డిజిటల్ రైట్స్ కోసం కూడా భారీగా కొటేషన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

First Published:  30 April 2019 3:21 AM GMT
Next Story