Telugu Global
Cinema & Entertainment

ఆధ్యాత్మిక ప్రదేశం లో మాస్ ఫైట్ తీస్తున్న పూరి

పూరి జగన్నాథ్ ఒక హిట్ సినిమా తీసి చాలా రోజులు అయింది. ఒక వైపు ఇండస్ట్రీ జనాలు, మరో వైపు స్టార్ హీరోలు, ఇంకో వైపు ప్రేక్షకులు, పూరి అభిమానులు ఎప్పుడెప్పుడు పూరి సక్సెస్ ఫామ్ లో కి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రామ్ పోతినేని తో ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రం తీస్తున్న పూరి, చిత్ర యూనిట్ తో కలిసి వారణాసి కి చేరుకున్నారు. ఈ చిత్రానికి సహా నిర్మాత గా వ్యవహరిస్తున్న […]

ఆధ్యాత్మిక ప్రదేశం లో మాస్ ఫైట్ తీస్తున్న పూరి
X

పూరి జగన్నాథ్ ఒక హిట్ సినిమా తీసి చాలా రోజులు అయింది. ఒక వైపు ఇండస్ట్రీ జనాలు, మరో వైపు స్టార్ హీరోలు, ఇంకో వైపు ప్రేక్షకులు, పూరి అభిమానులు ఎప్పుడెప్పుడు పూరి సక్సెస్ ఫామ్ లో కి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు రామ్ పోతినేని తో ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రం తీస్తున్న పూరి, చిత్ర యూనిట్ తో కలిసి వారణాసి కి చేరుకున్నారు. ఈ చిత్రానికి సహా నిర్మాత గా వ్యవహరిస్తున్న ఛార్మి ఈ విషయాన్ని సోషల్ మీడియా లో తెలిపింది.

“ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్ టీమ్ మొత్తం వారణాసి కి చేరుకున్నాము. ఇక్కడ చూస్తే చాలా ఎండ గా ఉంది. వేడి బాగా ఎక్కువగా ఉంది. రేపటి నుండి ఇక్కడ ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాము. మేము అందరం బాగా ఎక్సయిటెడ్ గా షూట్ కోసం ఎదురు చూస్తున్నాము” అని తెలిపింది.

ఈ సినిమా లో రామ్ సరసన నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమా కి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ని దసరా సమయానికి విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

First Published:  30 April 2019 2:24 AM GMT
Next Story