Telugu Global
Cinema & Entertainment

నాని-సుధీర్ బాబు మల్టీస్టారర్ ప్రారంభం

తన కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ మూవీని ఈరోజు లాంఛ్ చేశాడు నాని. అవును.. నాని హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు V అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా ప్రకటనకు సంబంధించి నిర్మాతల అత్యుత్సాహం వల్ల చిన్నపాటి గందరగోళం నెలకొంది. ముందుగా ఈ సినిమాలో సుధీర్ […]

నాని-సుధీర్ బాబు మల్టీస్టారర్ ప్రారంభం
X

తన కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ మూవీని ఈరోజు లాంఛ్ చేశాడు నాని. అవును.. నాని హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మరో హీరోగా సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు V అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సినిమా ప్రకటనకు సంబంధించి నిర్మాతల అత్యుత్సాహం వల్ల చిన్నపాటి గందరగోళం నెలకొంది. ముందుగా ఈ సినిమాలో సుధీర్ బాబు మాత్రమే హీరో అనే అర్థం వచ్చేలా ప్రకటన చేశారు. దీంతో అంతా షాకయ్యారు. వరుసగా ఫోన్ కాల్స్ కూడా వెళ్లాయి. తప్పుతెలుసుకున్న యూనిట్ వెంటనే దాన్ని సరిదిద్దుకుంది. తమ సినిమాలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్నారని ప్రకటించింది. అంతేకాదు, టైటిల్ లోగో మధ్యలో ఇది నాని 25వ చిత్రం అని కూడా పెట్టారు.

ఈ సినిమాలో నాని సరసన అదితిరావు, సుధీర్ బాబు సరసన నివేత థామస్ హీరోయిన్లుగా నటిస్తారు. ప్రారంభోత్సవానికి వాళ్లు కూడా వచ్చారు. ప్రస్తుతం సైరా సినిమాకు సంగీతం అందిస్తున్న అమిత్ త్రివేది, ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. తెలుగులో ఇతడికిది రెండో సినిమా. త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది V మూవీ.

First Published:  29 April 2019 5:12 AM GMT
Next Story