Telugu Global
National

అతి తీవ్ర తుపానుగా మారనున్న 'ఫొని'.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఫొని తుపాను ఇవాళ అతి తీవ్ర తుఫాను (సూపర్ సైక్లోన్)గా మారనుందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆదివారం రాత్రి నాటికి చెన్నైకు ఆగ్నేయంగా 910, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్ల దూరంలో ఈ ఫొని కేంద్రీకృతమై ఉంది. సోమవారం నాటికి అది సూపర్ సైక్లోన్‌గా మారుతుందని.. ప్రస్తుతం వాయువ్య దిశగా 21 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని ఐఎండీ తెలిపింది. మంగళవారం నుంచి ఈ తుఫాను ప్రభావం తమిళనాడు, దక్షిణ […]

అతి తీవ్ర తుపానుగా మారనున్న ఫొని.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
X

బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన ఫొని తుపాను ఇవాళ అతి తీవ్ర తుఫాను (సూపర్ సైక్లోన్)గా మారనుందని వాతావరణ శాఖ తెలియజేసింది.

ఆదివారం రాత్రి నాటికి చెన్నైకు ఆగ్నేయంగా 910, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్ల దూరంలో ఈ ఫొని కేంద్రీకృతమై ఉంది. సోమవారం నాటికి అది సూపర్ సైక్లోన్‌గా మారుతుందని.. ప్రస్తుతం వాయువ్య దిశగా 21 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని ఐఎండీ తెలిపింది.

మంగళవారం నుంచి ఈ తుఫాను ప్రభావం తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి కనిపిస్తుందని.. బలమైన గాలులు వీయడంతో పాటు వర్షాలు కూడా పడతాయని అధికారులు తెలియజేశారు. ఫొని తుఫాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

ఇది తుఫానుగా ఉన్న సమయంలో గంటటకు 110-125, తీవ్ర తుఫానుగా మారాక 130-155, సూపర్ సైక్లోన్ అయ్యాక 160-195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలుస్తోంది.

మరోవైపు ‘ఫొని’ తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని విశాఖపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 2వ నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

First Published:  28 April 2019 8:54 PM GMT
Next Story