Telugu Global
Cinema & Entertainment

'శ్రద్ధ శ్రీనాథ్' ఫస్ట్ ఛాయిస్ కాదట!

కన్నడ, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్ధ శ్రీనాథ్ ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోయిన్ గా పరిచయమైంది. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో శ్రద్ధ నటనకు నూటికి నూరు మార్కులు పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. నాని భార్య పాత్రలో శ్రద్ద శ్రీనాద్ చాలా అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమాకు శ్రద్ద శ్రీనాద్ […]

శ్రద్ధ శ్రీనాథ్ ఫస్ట్ ఛాయిస్ కాదట!
X

కన్నడ, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్ధ శ్రీనాథ్ ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హీరోయిన్ గా పరిచయమైంది. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

ఈ సినిమాలో శ్రద్ధ నటనకు నూటికి నూరు మార్కులు పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. నాని భార్య పాత్రలో శ్రద్ద శ్రీనాద్ చాలా అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమాకు శ్రద్ద శ్రీనాద్ ఫస్ట్ ఛాయిస్ కాదట.

తాజా సమాచారం ప్రకారం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కోసం ముందుగా వేరొకరిని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చాలామంది పేరున్న పెద్ద హీరోయిన్లను గౌతమ్ తిన్నానూరి ఈ పాత్ర కోసం సంప్రదించాడట. కానీ వివిధ కారణాల వల్ల అందులో ఒక్కరు కూడా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పలేదట. ఆ సమయంలో నాని మరియు చిత్ర బృందం శ్రద్ధా శ్రీనాధ్ ను ఎంపిక చేశారట. ఆమెకు కథ మరియు తన పాత్ర నచ్చడంతో వెంటనే సినిమాకు ఒప్పేసుకుందట.

తాజాగా శ్రద్ధ శ్రీనాథ్ ‘జోడి’ అనే మరొక తెలుగు సినిమాలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆది హీరోగా నటిస్తున్నాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న శ్రద్ధ శ్రీనాథ్ రెండవ సినిమాతో కూడా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

First Published:  27 April 2019 10:52 PM GMT
Next Story