Telugu Global
International

జాన్సన్ బేబీ షాంపుపై దేశవ్యాప్త నిషేధం

చిన్నపిల్లలకు వాడే కాస్మొటిక్స్ ఉత్పత్తిలో జాన్సన్ అండ్ జాన్సన్ ప్రసిద్ది. అయితే ఆ కంపెనీకి చెందిన జాన్సన్ బేబీ షాంపూలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు ల్యాబ్ టెస్టుల్లో వెల్లడికావడంతో వాటి అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జాన్సన్ ఉత్పత్తులపై ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించారు. జాన్సన్ ఉత్పత్తులు అత్యధికంగా ఉండే రాష్ట్రాలతో పాటు ఐదు జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, […]

జాన్సన్ బేబీ షాంపుపై దేశవ్యాప్త నిషేధం
X

చిన్నపిల్లలకు వాడే కాస్మొటిక్స్ ఉత్పత్తిలో జాన్సన్ అండ్ జాన్సన్ ప్రసిద్ది. అయితే ఆ కంపెనీకి చెందిన జాన్సన్ బేబీ షాంపూలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు ల్యాబ్ టెస్టుల్లో వెల్లడికావడంతో వాటి అమ్మకాలు వెంటనే నిలిపివేయాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అయిదు రాష్ట్రాల్లో జాన్సన్ ఉత్పత్తులపై ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించారు.

జాన్సన్ ఉత్పత్తులు అత్యధికంగా ఉండే రాష్ట్రాలతో పాటు ఐదు జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో జన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన బేబీ షాంపూ, బేబీ టాల్కమ్ పౌడర్లను పరీక్షించారు. వీటిలో రాజస్థాన్ శాంపిల్స్‌కు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన ఫార్మాల్డిహైడ్ ఉన్నట్లు తేలింది. అంతే కాకుండా ఆస్బెస్టాస్, క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ ల్యాబ్ టెస్టుల ఆధారంగా వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాన్సన్ బేబీ షాంపూ అమ్మకాలను నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఎన్‌సీపీసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన రాష్ట్రాల రిపోర్టులు వచ్చాక పూర్తి స్థాయి నిషేధం విధించే అవకాశం ఉంది.

ఇక, గత ఏడాది డిసెంబర్‌లో జాన్సన్ గ్రూప్‌కు చెందిన రెండు ఫ్యాక్టరీలలో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చేసిన పరీక్షల్లో ప్రమాదరక కారకాలు ఉన్నాయని తెలిసి జాన్సన్ టాల్కం పౌడర్‌పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

First Published:  28 April 2019 3:40 AM GMT
Next Story