Telugu Global
Health & Life Style

బ్రకోలి.... అందరూ తినాలి....

బ్రకోలి… ఇది ఎక్కువగా చలి ప్రదేశాలలో పెరుగుతుంది. భారతదేశంలో దీనిని శీతకాలంలో మాత్రమే సాగు చేస్తారు. క్యాబేజీ జాతికి చెందిన ఈ బ్రకోలిని సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్రకోలిలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో గతంలో తెలియదు కానీ… నేటి ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ఇటీవల బ్రకోలీ పట్ల ప్రజల్లో ఇష్టం పెరిగింది. ఎన్నో ఆరోగ్య గుణాలున్న బ్రకోలీ గురించి తెలుసుకుందాం. బ్రకోలి శరీరంలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. […]

బ్రకోలి.... అందరూ తినాలి....
X

బ్రకోలి… ఇది ఎక్కువగా చలి ప్రదేశాలలో పెరుగుతుంది. భారతదేశంలో దీనిని శీతకాలంలో మాత్రమే సాగు చేస్తారు. క్యాబేజీ జాతికి చెందిన ఈ బ్రకోలిని సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

బ్రకోలిలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో గతంలో తెలియదు కానీ… నేటి ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ఇటీవల బ్రకోలీ పట్ల ప్రజల్లో ఇష్టం పెరిగింది. ఎన్నో ఆరోగ్య గుణాలున్న బ్రకోలీ గురించి తెలుసుకుందాం.

 • బ్రకోలి శరీరంలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
 • ఇది కడుపులో ఉన్న క్రిములను నశింప చేస్తుంది. పేగుల్ని శుభ్ర పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది.
 • కడుపులో ఉన్న వ్యర్దాలను బయటకి పంపడానికి తోడ్పడుతుంది.
 • బ్రకోలిలో విటమిన్ ఇ, విటమిన్ బి5 పుష్కలంగా ఉన్నాయి.
 • శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి, శరీరాన్ని తేలికపరచాలంటే బ్రకోలి చక్కని ఔషధం.
 • ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర ఖనిజాలు ప్రీరాడికల్స్ ను నివారిస్తాయి.
 • బ్రకోలిలో ఉన్న మెగ్నీషియం, పొటాషియం నాడి వ్యవస్ద మీద బాగా పని చేస్తాయి. తరచుగా బ్రకోలి తినే వారికి సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ యాక్టీవ్ గా పనిచేస్తుంది.
 • బ్రకోలిలో ఉన్న సల్సోరిపోన్… శరీరంలో ఉన్న ఎంజైములకు ఎటువంటి హానీ కలగకుండా కాపాడుతుంది.
 • బ్రకోలిలో ఉన్న లూటిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రోగాలను అదపు చేస్తాయి.
 • బ్రకోలిలో గ్లూకోరఫినైన్ అనే పదార్దం ఉంది. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. అంతే కాదు అనేక చర్మ సమస్యలను నివారించి.. శరీరం కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
 • బ్రకోలిలో విటమిన్ సి, విటమిన్ కె తో పాటు ఇతర పోషకాలు బ్రెయిన్ పనితీరును మెరుగు పరచడానికి సహాయపడతాయి. మతిమరపుతో బాధపడుతున్న వారికి బ్రకోలి మంచి ఆహారమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 • సెన్సీటివ్ స్కిన్ లేదా సెన్సీటివ్ బాడీ ఉన్న వారికి బ్రకోలి దివ్యౌషధం. ఇందులో ఉన్న ఓమేగా 3, యాంటీ అలర్జీ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక అలర్జీల నుండి రక్షణ కల్పిస్తుంది.
 • మిగతా కూరలతో పోలిస్తే బ్రకోలిలో క్యాల్షియం శాతం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎముకలు, కండరాల సమస్యతలతో భాధపడుతున్న వారు తరచూ బ్రకోలి తింటే ఆ బాధల నుండి ఉపశమనం పొందుతారని వైద్యులు చెబుతున్నారు.
Next Story