Telugu Global
Cinema & Entertainment

లావణ్యకు లక్ కలిసిరావడం లేదు

గతేడాది ఎన్నో అంచనాల మధ్య చేసిన ఇంటలిజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. అదే ఏడాది చేసిన అంతరిక్షం సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కనీసం ఈ ఏడాదైనా బోణీ కొడదామనుకున్న లావణ్య త్రిపాఠి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన అర్జున్ సురవరం సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. దీంతో లావణ్య త్రిపాఠిలో టెన్షన్ రెట్టింపయింది. ప్రస్తుతం ఆమె కెరీర్ డైలమాలో పడింది. అర్జున్ సురవరం హిట్ అయితేనే ఆమెకు […]

లావణ్యకు లక్ కలిసిరావడం లేదు
X

గతేడాది ఎన్నో అంచనాల మధ్య చేసిన ఇంటలిజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. అదే ఏడాది చేసిన అంతరిక్షం సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. కనీసం ఈ ఏడాదైనా బోణీ కొడదామనుకున్న లావణ్య త్రిపాఠి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన అర్జున్ సురవరం సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. దీంతో లావణ్య త్రిపాఠిలో టెన్షన్ రెట్టింపయింది.

ప్రస్తుతం ఆమె కెరీర్ డైలమాలో పడింది. అర్జున్ సురవరం హిట్ అయితేనే ఆమెకు మరో ఛాన్స్ వస్తుంది. లేదంటే పరభాషా చిత్రాలవైపు తొంగి చూడడమే. అందుకే అర్జున్ సురవరంపై చాలా అశలు పెట్టుకుంది లావణ్య. కానీ ఆ సినిమా మాత్రం నెలకోసారి వాయిదాపడుతూనే ఉంది.

పండగ సీజన్ అనిచెప్పి సంక్రాంతి నుంచి తప్పించారు. ఫిబ్రవరి నాటికి టైటిల్ రచ్చ మొదలై వాయిదాపడింది. మార్చిలో విడుదల చేద్దాం అనుకుంటే రీషూట్ కు వెళ్లారు. ఇక ఏప్రిల్ లో విడుదల చేద్దాం అనుకున్న టైమ్ కు డిస్ట్రిబ్యూటర్లు అభ్యంతరం చెబుతున్నారు. ఇలా అర్జున్ సురవరం సినిమా వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉంది. మరోవైపు లావణ్యకు టెన్షన్ పెరిగిపోతోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమాను మే మూడో వారంలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. కనీసం మే నెలలోనే ఈ సినిమా రిలీజైతే లావణ్య జాతకం తేలిపోతుంది.

First Published:  26 April 2019 9:08 PM GMT
Next Story