Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు సినిమాకు సరికొత్త టైటిల్

సరిలేరు నీకెవ్వరు.. గతంలో ఈ సాహిత్యంతో ఓ సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఇప్పుడు అదే సాహిత్యం, మహేష్ బాబు సినిమా టైటిల్ గా మారబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు కొత్త సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతోంది ఈ మూవీ. నిజానికి ఇలాంటి పక్కా తెలుగు టైటిల్స్ అనీల్ కు ఇష్టం ఉండవు. ఆయన టైటిల్స్ అన్నీ క్యాచీగా, అవసరమైతే ఇంగ్లిష్ పదాల్లో ఉంటాయి. కెరీర్ […]

మహేష్ బాబు సినిమాకు సరికొత్త టైటిల్
X

సరిలేరు నీకెవ్వరు.. గతంలో ఈ సాహిత్యంతో ఓ సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఇప్పుడు అదే సాహిత్యం, మహేష్ బాబు సినిమా టైటిల్ గా మారబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు కొత్త సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతోంది ఈ మూవీ.

నిజానికి ఇలాంటి పక్కా తెలుగు టైటిల్స్ అనీల్ కు ఇష్టం ఉండవు. ఆయన టైటిల్స్ అన్నీ క్యాచీగా, అవసరమైతే ఇంగ్లిష్ పదాల్లో ఉంటాయి. కెరీర్ లో తొలిసారి ఇలా అచ్చ తెలుగు టైటిల్ ను ఆయన పరిశీలిస్తున్నాడు. అయితే ఈ టైటిల్ ఇంకా ఫిక్స్ రాలేదు. జస్ట్ ఫీలర్ గా అలా వదిలారంతే. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి అప్పుడు ఓ నిర్ణయం తీసుకుంటారు.

జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. మూడు కీలక పాత్రల కోసం విజయశాంతి, బండ్ల గణేశ్, జగపతి బాబు ను ఆల్రెడీ తీసుకున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.

First Published:  27 April 2019 2:35 AM GMT
Next Story