Telugu Global
NEWS

ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బోల్తా

నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల విజయం లీగ్ టేబుల్ ఆరు, ఏడు స్థానాలలో కోల్ కతా, రాజస్థాన్ ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు అంచనాలకు అందనివిధంగా …ఆసక్తికరంగా సాగుతున్నాయి. మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ..దొందూ దొందే అన్నట్లు గా తయారయ్యాయి. మొదటి 11 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి రెండుజట్లూ చెరో నాలుగు విజయాలు, 7 పరాజయాల రికార్డుతో….లీగ్ టేబుల్ […]

ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బోల్తా
X
  • నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల విజయం
  • లీగ్ టేబుల్ ఆరు, ఏడు స్థానాలలో కోల్ కతా, రాజస్థాన్

ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పోటీలు అంచనాలకు అందనివిధంగా …ఆసక్తికరంగా సాగుతున్నాయి. మాజీ చాంపియన్లు రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ..దొందూ దొందే అన్నట్లు గా తయారయ్యాయి.

మొదటి 11 రౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి రెండుజట్లూ చెరో నాలుగు విజయాలు, 7 పరాజయాల రికార్డుతో….లీగ్ టేబుల్ ఆరు, ఏడు స్థానాలకు పరిమితమయ్యాయి. ప్లే ఆఫ్ రౌండ్ కు దాదాపుగా దూరమయ్యే ప్రమాదంలో చిక్కుకొన్నాయి.

భారత క్రికెట్ మక్కా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన కీలక మ్యాచ్ లో ఆతిథ్య నైట్ రైడర్స్ కు రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో షాకిచ్చింది. ఈమ్యాచ్ లో కీలక టాస్ నెగ్గిన రాజస్తాన్ .. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని…ప్రత్యర్థి కోల్ కతా నైట్ రైడర్స్ ను 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగుల స్కోరుకే పరిమితం చేసింది.

దినేశ్ కార్తీక్ సిక్సర్ల మోత…

కోల్ కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ 50 బాల్స్ లో 7 బౌండ్రీలు, 9 సిక్సర్లతో 97 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. ప్రస్తుత సీజన్లో వరుస వైఫల్యాలతో కొట్టిమిట్టాడుతున్న దినేశ్ కార్తీక్… ఈ భారీస్కోరుతో ఊపిరిపీల్చుకోగలిగాడు.

కోల్ కతా 175 పరుగుల స్కోరుకు సమాధానంగా…176 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు…ఓపెనర్లు సంజు శాంసన్-అజింక్యా రహానే మొదటివికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

పరాగ్ మ్యాచ్ విన్నింగ్ నాక్….

మిడిలార్డర్లో యువ ఆటగాడు పరాగ్ 31 బాల్స్ లో 5 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 47 పరుగుల కీలక స్కోరు సాధించి…మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే..తనజట్టుకు 3 వికెట్ల విజయం అందించాడు. రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి విజయలక్ష్యాన్ని చేదించ గలిగింది.

రాజస్థాన్ రాయల్స్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

First Published:  26 April 2019 6:00 AM GMT
Next Story