Telugu Global
NEWS

పంథా మార్చిన పచ్చ మీడియా..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయో లెక్కలు వేసుకుంటున్నాయి. ఆ ఓటర్లు పెరిగారు కాబట్టి మాకు లాభమని కొన్ని పార్టీలు, ఈ ఓటర్లు బారులు తీరారు కాబట్టి ఆ ఓట్లు తమకేనని మరికొన్ని పార్టీలు లెక్కలు కడుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీకి అనుంగు అనుచరులుగా ఉన్న పచ్చ మీడియా తన లెక్కలు తాను వేసుకుంది. ఎన్నికలు ముగిసిన రోజునుంచి రెండు మూడు రోజుల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీదే […]

పంథా మార్చిన పచ్చ మీడియా..!
X

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయో లెక్కలు వేసుకుంటున్నాయి. ఆ ఓటర్లు పెరిగారు కాబట్టి మాకు లాభమని కొన్ని పార్టీలు, ఈ ఓటర్లు బారులు తీరారు కాబట్టి ఆ ఓట్లు తమకేనని మరికొన్ని పార్టీలు లెక్కలు కడుతున్నాయి.

అధికార తెలుగుదేశం పార్టీకి అనుంగు అనుచరులుగా ఉన్న పచ్చ మీడియా తన లెక్కలు తాను వేసుకుంది. ఎన్నికలు ముగిసిన రోజునుంచి రెండు మూడు రోజుల క్రితం వరకూ తెలుగుదేశం పార్టీదే తిరిగి అధికారమని కథనాలు ప్రచురించింది. ఇందుకోసం వారి లెక్కలు వారు వేసుకున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆ పార్టీని గట్టేక్కిస్తాయంటూ కథనాలు రాసారు. ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి తెలుగుదేశానిదే గెలుపంటూ తీర్మానించారు. అయితే నాలుగైదు రోజులుగా పచ్చ మీడియా పంథా మారినట్లుగా కనిపిస్తోంది. తాము వేసిన అంచనాలను, తాము రాసిన కథనాలను పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికలలో అధికార తెలుగుదేశం పార్టీకంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ డబ్బులు వెదజల్లిందని, దీని కారణంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ కథనాలు ప్రచురిస్తున్నారు.

జిల్లాల వారిగా ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో అధికార తెలుగుదేశం పార్టీకి సూచిస్తూ కథనాలు ప్రచురిస్తున్నారు. అనంతపురం జిల్లాలో అన్ని స్దానాలు తెలుగుదేశమే గెలుచుకుంటుందని చెప్పిన సదరు మీడియా…. ఇప్పుడు ఆ జిల్లాలో గ్రూపు తగదాల వల్ల భారీ నష్టం జరుగుతోందంటూ కథనాలు రాస్తున్నారు.

అలాగే ఉభయ గోదావరి జిల్లాలలోను, ఉత్తరాంధ్ర జిల్లాలలోను సైకిల్ పంచర్ అవుతుందంటూ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. పోలింగ్ ముగిసిన పదిరోజుల తర్వాత వాస్తవాలు అర్థం అయి పచ్చ మీడియా పంథా మార్చుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  23 April 2019 4:35 AM GMT
Next Story