Telugu Global
Cinema & Entertainment

బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ వేశారు

టాలీవుడ్ లో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఏ దర్శకుడు రెండో సినిమాతో హిట్ కొట్టిన దాఖలాలు లేవు. దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఒక దశలో అలాంటి దర్శకులకు సెకెండ్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా హీరోలు వెనకాడారు. కానీ ఇప్పుడా నెగెటివ్ సెంటిమెంట్ ను ఇద్దరు దర్శకులు బద్దలుకొట్టారు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ముందుగా శివ నిర్వాణ విషయానికొద్దాం. మొదటి మూవీ నిన్నుకోరితో హిట్ కొట్టాడు […]

బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ వేశారు
X

టాలీవుడ్ లో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఏ దర్శకుడు రెండో సినిమాతో హిట్ కొట్టిన దాఖలాలు లేవు. దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఒక దశలో అలాంటి దర్శకులకు సెకెండ్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా హీరోలు వెనకాడారు. కానీ ఇప్పుడా నెగెటివ్ సెంటిమెంట్ ను ఇద్దరు దర్శకులు బద్దలుకొట్టారు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.

ముందుగా శివ నిర్వాణ విషయానికొద్దాం. మొదటి మూవీ నిన్నుకోరితో హిట్ కొట్టాడు ఈ దర్శకుడు. దీంతో ఇతడు తీసే రెండో సినిమాపై అందరూ అనుమానాలు వ్యక్తంచేశారు. కానీ రెండో సినిమాతో అంతకంటే పెద్ద హిట్ కొట్టాడు. నాగచైతన్య, సమంతలను హీరోహీరోయిన్లుగా పెట్టి మజిలీ చేసిన శివ నిర్వాణ, బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చైతూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది.

మరో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా అంతే. మొదటి ప్రయత్నంగా సుమంత్ తో మళ్లీ రావా అనే సినిమా చేశాడు. అది హిట్ అయింది. రెండో ప్రయత్నంగా నానితో జెర్సీ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బ్యాడ్ సెంటిమెంట్ ను బద్దలుకొట్టింది. గౌతమ్ కు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఇలా ఈ ఇద్దరు దర్శకులు సక్సెస్ ఫుల్ గా సెకెండ్ మూవీ సిండ్రోమ్ ను అధిగమించారు.

First Published:  21 April 2019 11:13 PM GMT
Next Story