Telugu Global
Health & Life Style

సలాడ్స్... సమతుల్యమైన ఆహారం

ఎప్పుడూ ఒకే రకం ఆహారం తింటే కొంచెం బోర్ కొడుతుంది కదా… అలాగే ఆరోగ్యపరంగా కూడా కాసింత కొత్తదనం చూపించుకోవాలి. అందుకే కొంచెం ఆధునికతను జోడించి అటు రుచిని… ఇటు ఆరోగ్యాన్ని కూడా అందుకోవచ్చు. సలాడ్స్. ఇవి అనేక రకాలు.. వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, గ్రీన్ సలాడ్, స్ప్రౌ ట్స్ సలాడ్… (మొలకెత్తిన విత్తనాలు) ఇలా.. ఏ సలాడ్ అయినా ఆరోగ్యమే అంటున్నారు వైద్య నిపుణులు. సలాడ్స్ వల్ల కొన్ని ఉపయోగాలు. సలాడ్స్ లో శరీరానికి […]

సలాడ్స్... సమతుల్యమైన ఆహారం
X

ఎప్పుడూ ఒకే రకం ఆహారం తింటే కొంచెం బోర్ కొడుతుంది కదా… అలాగే ఆరోగ్యపరంగా కూడా కాసింత కొత్తదనం చూపించుకోవాలి. అందుకే కొంచెం ఆధునికతను జోడించి అటు రుచిని… ఇటు ఆరోగ్యాన్ని కూడా అందుకోవచ్చు.

సలాడ్స్. ఇవి అనేక రకాలు.. వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, గ్రీన్ సలాడ్, స్ప్రౌ ట్స్ సలాడ్… (మొలకెత్తిన విత్తనాలు) ఇలా.. ఏ సలాడ్ అయినా ఆరోగ్యమే అంటున్నారు వైద్య నిపుణులు. సలాడ్స్ వల్ల కొన్ని ఉపయోగాలు.

  • సలాడ్స్ లో శరీరానికి కావల్సిన అన్ని రకాల ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.
  • మిగతా ఆహార పదార్దాలలో ఉడకపెడుతున్నప్పుడు కొన్ని ప్రొటీన్లు ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది.. కాని సలాడ్స్ ను మనం పచ్చిగానే తీసుకుంటాం కాబట్టి కూరలలో ఉన్న ప్రొటీన్లు పూర్తిగా శరీరానికి అందుతాయి.
  • అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సలాడ్ తింటే క్రమేపీ బరువు తగ్గుతారు.
  • సలాడ్స్ లో మొలకెత్తిన విత్తనాలు కలుపుకుంటే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం నివారిస్తుంది.
  • సలాడ్స్ లో ఉన్న ఫైబర్, ఫొలిక్ యాసిడ్ రుతు సమస్యలను సరిచేసి సంతాన సాఫల్యతను పెంచుతాయి.
  • సలాడ్స్ లో క్యాలరీలు, కొవ్వు చాలా తక్కువ గా ఉంటుంది. అంటే మిగతా పదార్థాల్లా సలాడ్స్ తీసుకుంటే కొవ్వు దరిచేరదన్నమాట.
  • ప్రతి రోజు సలాడ్స్ తినడం వల్ల మానసికంగా ఆరోగ్యం చేకూరుతుంది.
  • చర్మానికి కావల్సిన తేమను సలాడ్స్ అందిస్తాయి. దీని వల్ల చర్మం మృదువుగాను, కాంతివంతంగాను తయారవుతుంది.
  • సలాడ్స్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ సమస్యలను తగ్గిస్తుంది.
  • విటమిన్ల లోపంతో బాధపడుతున్న వారికి సలాడ్స్ దివ్యమైన ఔషధం.
  • ప్రతిరోజు సలాడ్స్ తినడం వల్ల శరీరం ఎంతో తేలికగా ఉంటుంది. దీని వల్ల శరీరానికి కొత్త ఉల్లాసం, ఉత్తేజం కలుగుతాయి.
  • స్కిన్ టోన్ మెరుగుపడాలంటే సలాడ్స్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.
  • సలాడ్స్ వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు లేవు. దీని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువ అంటున్నారు వైద్య నిపుణులు.
  • సలాడ్స్ రక్తాన్ని శుభ్ర పరుస్తాయి… దీని వల్ల గుండెకు మంచి రక్తం అందుతుంది.
  • సలాడ్స్ లో ఉండే విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలు, కండరాలకు బలాన్ని ఇస్తుంది.
First Published:  21 April 2019 9:05 PM GMT
Next Story