Telugu Global
Cinema & Entertainment

ఫ్రెష్ జోడీ... నితిన్ సరసన మహేష్ బ్యూటీ

తెలుగుతెరపైకి మరో ఫ్రెష్ కాంబినేషన్ రాబోతోంది. నితిన్ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే ఫస్ట్ టైం. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. నిజానికి క్రేజీ హీరోయిన్లను వెంటనే తన సినిమాల్లోకి లాగేస్తుంటాడు నితిన్. దాదాపు దశాబ్దం నుంచి ఈ హీరోది ఇదే పద్ధతి. కానీ ఎందుకో రకుల్ మిస్ అయింది. గత రెండు సినిమాలకు […]

ఫ్రెష్ జోడీ... నితిన్ సరసన మహేష్ బ్యూటీ
X

తెలుగుతెరపైకి మరో ఫ్రెష్ కాంబినేషన్ రాబోతోంది. నితిన్ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఇదే ఫస్ట్ టైం. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

నిజానికి క్రేజీ హీరోయిన్లను వెంటనే తన సినిమాల్లోకి లాగేస్తుంటాడు నితిన్. దాదాపు దశాబ్దం నుంచి ఈ హీరోది ఇదే పద్ధతి. కానీ ఎందుకో రకుల్ మిస్ అయింది. గత రెండు సినిమాలకు మేఘా ఆకాష్ నే రిపీట్ చేయడంతో ఈ గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు ఆ గ్యాప్ ను ఇప్పుడు భర్తీచేశాడు నితిన్.

గతంలో ప్రియమణి, సమంత, నిత్యామీనన్, ఇలియానా, జెనీలియా.. ఇలా ఎంతోమంది భామలకు హిట్ కొట్టిన వెంటనే తన సినిమాల్లో అవకాశమిచ్చాడు నితిన్. కాస్త లేట్ అయినా రకుల్ కు ఇప్పుడా అవకాశం వచ్చింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రాబోతోంది. ఈ సినిమా తర్వాతే వెంకీ కుడుముల మూవీ స్టార్ట్ అవుతుంది.

First Published:  22 April 2019 5:00 AM GMT
Next Story