Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ కొత్త హోస్ట్ నయనతార?

తెలుగు తమిళ భాషల్లో నయనతార కి ఉన్న క్రేజ్ వేరు. స్టార్ హీరోల తో సమానం గా అభిమానాన్ని సంపాదించుకొని, వారికి ధీటుగా సినిమాల్లో, పారితోషికం లో పోటీ ఇస్తూ నయనతార దూసుకుపోతుంది. అయితే నయనతార తెలుగు లో కన్నా తమిళ్ లో నే ఎక్కువ పాపులర్. లేడీ సూపర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నయనతార త్వరలో బుల్లి తెర మీద కి రానుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన చర్చ ఏంటి అంటే […]

బిగ్ బాస్ కొత్త హోస్ట్ నయనతార?
X

తెలుగు తమిళ భాషల్లో నయనతార కి ఉన్న క్రేజ్ వేరు. స్టార్ హీరోల తో సమానం గా అభిమానాన్ని సంపాదించుకొని, వారికి ధీటుగా సినిమాల్లో, పారితోషికం లో పోటీ ఇస్తూ నయనతార దూసుకుపోతుంది.

అయితే నయనతార తెలుగు లో కన్నా తమిళ్ లో నే ఎక్కువ పాపులర్. లేడీ సూపర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నయనతార త్వరలో బుల్లి తెర మీద కి రానుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన చర్చ ఏంటి అంటే నయనతార తమిళ్ లో త్వరలో మొదలు కానున్న బిగ్ బాస్ 3 ని హోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయట.

మొదటి రెండు సీజన్లని సక్సెసఫుల్ గా హోస్ట్ చేసిన కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం మూలాన మూడో సీజన్ నుండి దూరం కావాలని నిర్ణయించుకోవడం వలన బిగ్ బాస్ నిర్వాహకులు ఇంకొకళ్ళని వెతికే పని మొదలు పెట్టారు.

ఆ ప్రక్రియ లో భాగం గా నయనతార ని అప్రోచ్ అయితే బాగుంటుంది అనే విషయం పై ఆమెతో కూడా చర్చలు జరుపుతున్నారట. ఇప్పటికి అయితే కేవలం ఇది ఒక రూమర్ మాత్రమే…. కానీ నయనతార ఒప్పుకొనే అవకాశాలు కూడా ఉన్నాయని తమిళ్ ఫిలిం నగర్ లో వినికిడి.

First Published:  21 April 2019 10:59 PM GMT
Next Story