Telugu Global
Cinema & Entertainment

న్యూజిలాండ్ లో 'మంచు' వారి భక్త కన్నప్ప

అప్పట్లో మిథునం చిత్రం తీసిన తర్వాత తనికెళ్ళ భరణి సునీల్ ని హీరో గా పెట్టి భక్త కన్నప్ప అనే చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా గురించి ప్రకటన కూడా చేశారు. అయితే ఆ తర్వాత సునీల్ బిజీ అవ్వడం తో మంచు విష్ణు తో సినిమా చేద్దాం అనుకున్నారు భరణి. ఆఖరికి ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండడం తో భరణి కి ఇంట్రెస్ట్ పోయి, సినిమా కథ ని మంచు హీరో కి ఇచ్చేసారు. తర్వాత […]

న్యూజిలాండ్ లో మంచు వారి భక్త కన్నప్ప
X

అప్పట్లో మిథునం చిత్రం తీసిన తర్వాత తనికెళ్ళ భరణి సునీల్ ని హీరో గా పెట్టి భక్త కన్నప్ప అనే చిత్రం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా గురించి ప్రకటన కూడా చేశారు.

అయితే ఆ తర్వాత సునీల్ బిజీ అవ్వడం తో మంచు విష్ణు తో సినిమా చేద్దాం అనుకున్నారు భరణి. ఆఖరికి ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండడం తో భరణి కి ఇంట్రెస్ట్ పోయి, సినిమా కథ ని మంచు హీరో కి ఇచ్చేసారు. తర్వాత అనేక సందర్భాల్లో ఈ సినిమా ని ఒక హాలీవుడ్ దర్శకుడి తో మంచు విష్ణు చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు.

అయితే తాజాగా ఈ సినిమా ని మళ్ళీ తెరపైకి తెచ్చే పనిని మొదలు పెట్టాడు విష్ణు. ప్రస్తుతం కొత్త సినిమాలు ఏమి లేవు కనుక ఇదే కరెక్ట్ టైం అని విష్ణు భావిస్తున్నాడట.

ప్రస్తుతం ఆయన న్యూజిలాండ్ దేశం లో ఈ సినిమా కోసం లొకేషన్స్ ని వెతుకుతున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ లో విష్ణు ఈ సినిమా ని భారీ బడ్జెట్ తో నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాడు విష్ణు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు విష్ణు హైదరాబాద్ కు తిరిగి వచ్చాక వెల్లడించే అవకాశం ఉంది.

First Published:  22 April 2019 12:34 AM GMT
Next Story