Telugu Global
NEWS

ఇల్లు దేవేందర్‌ గౌడ్‌ది.... అద్దెకుండేది ఒక ప్రైవేట్‌ కంపెనీ.... అద్దెచెల్లించేది ఏపీ ప్రభుత్వం.... అద్దెతీసుకునేది కోడెల....

ఎల్వీసుబ్రమణ్యం ఏపీ ప్రధాన కార్యదర్శి కాగానే చంద్రబాబు ఎందుకు చిందులేశాడో ఇప్పుడు అర్థమౌతోంది. చంద్రబాబు & కో… అవినీతి వ్యవహారాల తాలూకూ ఒక్కో ఫైల్‌ ను ఎల్వీసుబ్రమణ్యం దుమ్ము దులుపుతుంటే టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అవినీతికి పాల్పడ్డందుకు ఆశ్చర్యం లేదు కానీ…. ఇన్నేళ్ళ అనుభవం తరువాత ఇంత అడ్డగోలుగా అవినీతికి పాల్పడతారా? అనేదే ఆశ్చర్యం. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 7 లో టీడీపీ నేత దేవేందర్‌ గౌడ్‌కి చెందిన ఒక బిల్డింగ్‌ ఉంది. అందులో […]

ఇల్లు దేవేందర్‌ గౌడ్‌ది....  అద్దెకుండేది ఒక ప్రైవేట్‌ కంపెనీ.... అద్దెచెల్లించేది ఏపీ ప్రభుత్వం.... అద్దెతీసుకునేది కోడెల....
X

ఎల్వీసుబ్రమణ్యం ఏపీ ప్రధాన కార్యదర్శి కాగానే చంద్రబాబు ఎందుకు చిందులేశాడో ఇప్పుడు అర్థమౌతోంది. చంద్రబాబు & కో… అవినీతి వ్యవహారాల తాలూకూ ఒక్కో ఫైల్‌ ను ఎల్వీసుబ్రమణ్యం దుమ్ము దులుపుతుంటే టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

అవినీతికి పాల్పడ్డందుకు ఆశ్చర్యం లేదు కానీ…. ఇన్నేళ్ళ అనుభవం తరువాత ఇంత అడ్డగోలుగా అవినీతికి పాల్పడతారా? అనేదే ఆశ్చర్యం.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 7 లో టీడీపీ నేత దేవేందర్‌ గౌడ్‌కి చెందిన ఒక బిల్డింగ్‌ ఉంది. అందులో శ్రీ వెంకటేశ్వరా మల్టీఫ్లెక్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే ఆఫీసు ఉంది. ఆ ఆఫీసు వాళ్లు ప్రతినెల దేవేందర్‌ గౌడ్‌కు అద్దె చెల్లిస్తున్నారు. అయితే అదే బిల్డింగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ పేరున అద్దె చెల్లిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ ఈ బిల్డింగ్‌ను హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంగా చూపించాడు.

నిజానికి కోడెల శివప్రసాద్‌ గుంటూరులో ఉంటూ ఉంటాడు. లేదా నరసరావు పేటలోని తన ఇంట్లో ఉంటాడు. లేకపోతే సత్తెనపల్లిలోని తన ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆయన హైదరాబాద్‌లో ఇప్పుడు కాపురం ఉండడం లేదు. అయినా దొంగ బిల్లులు పెట్టి నెల నెలా లక్ష రూపాయల అద్దెను ప్రభుత్వం నుంచి అప్పనంగా కొట్టేస్తున్నట్టు రుజువైంది.

First Published:  22 April 2019 6:25 AM GMT
Next Story