Telugu Global
Cinema & Entertainment

'మహర్షి' సినిమాలో గోదావరి జిల్లా విషాదం

‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లొనే 25 చిత్రమైన ‘మహర్షి’ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ […]

మహర్షి సినిమాలో గోదావరి జిల్లా విషాదం
X

‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లొనే 25 చిత్రమైన ‘మహర్షి’ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర లో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన ఒక విషాదం కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది.

1995 జనవరి లో ఈస్ట్ గోదావరి జిల్లాలో పసర్లపూడి అనే గ్రామం వద్ద ఒక పెద్ద పైప్లైన్ పేలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదం. ఏకంగా 25 గ్రామాలను బూడిదగా మార్చింది ఈ విపత్తు. పదిహేను వందల మంది నిరాశ్రయులయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఈ విషాదం ‘మహర్షి’ సినిమాలో చూపించబోతున్నారని, ఆ ఎపిసోడ్ సినిమాకి టర్నింగ్ పాయింట్ గా మారుతుందని చెబుతున్నారు. ఈ సినిమా మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

First Published:  21 April 2019 1:41 AM GMT
Next Story