Telugu Global
Cinema & Entertainment

కండల వీరుడితో కమెడియన్ కుటుంబం

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ ల జాబితాలో అలీ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా అలీ తెలుగు తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2018 మొత్తం మీద అలీ చేసింది ‘నెల టికెట్’ సినిమా మాత్రమే. టీవీ షోలతో బిజీగా ఉన్న అలీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అలీ తన […]

కండల వీరుడితో కమెడియన్ కుటుంబం
X
టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ ల జాబితాలో అలీ పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే గత కొంతకాలంగా అలీ తెలుగు తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2018 మొత్తం మీద అలీ చేసింది ‘నెల టికెట్’ సినిమా మాత్రమే. టీవీ షోలతో బిజీగా ఉన్న అలీ ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అలీ తన భార్య ముగ్గురు పిల్లలు, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి ఫోజ్ ఇచ్చారు. ఈ ఫోటో కింద దబాంగ్ 3 అని ఉండటంతో ఈ ఫోటో దబంగ్ 3 షూటింగ్ అప్పుడు తీసిందని తెలుస్తోంది.
అయితే అలీ ఇందులో ఖాకి డ్రెస్ లో కనిపించాడు. కాబట్టి ఈ సినిమాలో అలీ కూడా కనిపించబోతున్నాడు అని వార్తలు బయటకు వస్తున్నాయి. దబాంగ్ సిరీస్లో మూడవ భాగం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వినోద్ ఖన్నా, మహి గిల్ మరియు అర్బాజ్ ఖాన్ ఈ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది.

First Published:  21 April 2019 12:55 AM GMT
Next Story