Telugu Global
Cinema & Entertainment

ఈ సారి 'మల్లు అర్జున్' గట్టిగా ప్లాన్ చేసాడు !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం నుండి షూటింగ్ కి దూరం గా ఉన్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తో నిరుత్సాహపడిన అల్లు అర్జున్…. చాలా రోజులకి  ఒక కొత్త చిత్రానికి సైన్ చేసాడు. త్రివిక్రమ్ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా లో టబు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం […]

ఈ సారి మల్లు అర్జున్ గట్టిగా ప్లాన్ చేసాడు !
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం నుండి షూటింగ్ కి దూరం గా ఉన్నాడు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తో నిరుత్సాహపడిన అల్లు అర్జున్…. చాలా రోజులకి ఒక కొత్త చిత్రానికి సైన్ చేసాడు. త్రివిక్రమ్ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఈ సినిమా లో టబు ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఒక పాపులర్ మళయాళ నటుడిని తీసుకోవాలనుకుంటున్నారట.

జయరాం

అల్లు అర్జున్ కి కేరళ లో ఉన్న క్రేజ్ దుష్ట్యా ఒక మళయాళ నటుడిని సినిమాలో తీసుకుంటే బిజినెస్ పరంగా సినిమా బాగా నడుస్తుంది అనే ప్లాన్ లో ఉన్నారట దర్శక నిర్మాతలు.

వంద కు పైగా సినిమాలు చేసిన అగ్ర నటుడు జయరాం ఈ సినిమా లో ఒక కీలక పాత్ర లో మెరవనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా లో బోమన్ ఇరానీ ఒక పాత్ర లో మెరవనున్నారు. ఈ సినిమా కి ‘అలకనంద’ అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట.

పూజా హెగ్డే ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్, రాధ కృష్ణ జంటగా ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

First Published:  19 April 2019 8:01 PM GMT
Next Story